డబ్బు అంటే చేదు ఎవరకి? కోటి మార్గాలు కూటి కోసమే. ఆ కూటి కోసం డబ్బు కచ్చితంగా కావాలి కాబట్టి అందరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ లోకంలో సెకండ్ హ్యాండ్ కానిది డబ్బు ఒక్కటే. అందుకే డబ్బుని సంపాదించుకోవడంతో పాటు జాగ్రత్త చేసుకోవడం కూడా తెలియాలి. హిందూ మైథాలజీ ప్రకారం కొన్ని తప్పులు చేయడం వలన చేతిలో డబ్బు ఎప్పటికి నిలవదట. ఇంతకీ ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.
Advertisement
స్మశాన వాటిక దగ్గరికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా నవ్వకూడదు. అది అక్కడ ఉన్న ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. చెట్ల కింద మూత్ర విసర్జన చేయకూడదు, ఎద్దులను తన్నకూడదు. కొంతమంది మలమూత్ర విసర్జన సమయాల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన కూడా పేదవారుగా అవుతారట. ఇంటి పైకప్పు పైన అక్కర్లేని కలప లేదా ఇనుము వస్తువులను పెట్టేస్తూ ఉంటారు. దానివలన కూడా పేదవాళ్ళు అవుతారట. ఇంట్లో పాడైపోయిన తుప్పు సామాన్లు పెట్టడం, విరిగిపోయిన వస్తువులను వాడడం వలన కూడా ఇంట్లో డబ్బు నిలవదట.
Advertisement
40 రోజులు దాటిపోతున్నా హెయిర్ కట్ చేయించుకోకుండా ఉండడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, గోళ్ళని కొరకడం, సూర్యోదయం దాకా నిద్రపోవడం, ఎడమకాలితో పాంట్స్ వేసుకోవడం లాంటి అలవాట్లు అశుభాలకు సంకేతాలాట. షూస్, చెప్పులను తలకిందులుగా ఉంచకూడదు. ఇంటికి వచ్చిన బంధువులపై కోపగించుకోవడం, చీకటిగ ఉన్నపుడు ఆహరం తినడం, సాయంత్రం సమయంలో నిద్రపోయే అలవాట్లు ఉండడం కూడా పేదరికానికి సంకేతాలుగా నిలుస్తాయట. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని జాగ్రత్తగా ఆచరించండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
హీరో సూర్య చిల్ట్రన్స్ ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!