ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో గడియారం కూడా ఒకటి. ఏ పనిచేయాలన్నా ముందుగా సమయం చూసుకోవాలి. సమయం చూసుకోవాలంటే గడియారం కచ్చితంగా ఉండాలి.
Advertisement
అయితే మనజీవితంలో ముఖ్యమైన సమయాన్ని చూపే గడియారాన్ని ఎక్కడ పడితే అక్కడ అమర్చకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎక్కడ గడియారాన్ని అమర్చాలి…ఎక్కడ అమర్చకూడదు అనే కొన్ని నియామాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారాన్ని సరైన దిశలో అమర్చకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ గడియారాన్ని అమర్చడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కాబట్టి గడియారాన్ని ఇంట్లో తూర్పు, పడమర లేదంటే ఉత్తర దిశల్లో మాత్రమే అమర్చాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా అమర్చడం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగేలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. గోడ గడియారం ను ఉత్తరం దిక్కున అమర్చడం వల్ల సంపద పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
also read : కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇవి మర్చిపోవద్దు..!
అంతే కాకుండా ఉత్తరం దిక్కును ధనవంతుడైన కుభేరుడికి వినాయకుడి దిశగా చెబుతుంటారు. అందువల్ల ఉత్తరం దిక్కుకు గడియారం ఉండటం శుభప్రదం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గోడగడియారాన్ని ఆగ్నేయం, నెరుతి వైపు మరియు దక్షిణం వైపుకు అస్సలు వేళాడదీయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి బయట మరియు తలుపుకు కూడా గోడ గడియారాన్ని అసలు వేళాడదీయకూడదు. అదేవిధంగా ఇంట్లో చెడిపోయిన గడియారాలను మరియు పనిచేయని గడియారాలను కూడా అసలు ఉంచకూడదు.