Home » Sankranthi సంక్రాంతి 2023: సంక్రాంతి పండుగ రోజు ఈ 5 వస్తువులను దానం చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు..!

Sankranthi సంక్రాంతి 2023: సంక్రాంతి పండుగ రోజు ఈ 5 వస్తువులను దానం చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు..!

by Anji
Published: Last Updated on
Ad

Sankranthi సంక్రాంతి 2023: 2023లో సంక్రాంతి పండుగను జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగను జరుపుకోనున్నారు. సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా నదిస్నానం లేదా ఇంటి నీటిలో గంగాజలంతో స్నానం చేయడం చాలా ముఖ్యం. ఆ తరువాత సూర్య భగవానుడిని పూజించండి. మకర సంక్రాంతి స్నానం, పూజ తరువాత దానం చేస్తారు. రోజు దానం చేయడంతో చాలా పుణ్యం వస్తుంది. మకర సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల సూర్యుడు శనితో సహా 6 గ్రహాలతో సంబంధం ఉన్న దోషాలు తొలగిపోతాయని కాశీకి చెందిన జ్యోతిష్యుడు చక్రపాణి భట్ చెప్పారు. మకర సంక్రాంతి రోజు ఏయే వస్తువులు దానం చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సంక్రాంతి 2023

Advertisement

నువ్వులు : 

Manam Newsసంక్రాంతి పండుగ రోజు నువ్వులను దానం చేయడం చేయడం చాలా మంచిది. వీలు అయితే ఎక్కువగా నల్ల నువ్వులను దానం చేయాలి. నల్ల నువ్వులు కూడా అందుబాటులో లేకుంటే తెల్ల నువ్వులను దానం చేయండి. నువ్వులను దానం చేయడం ద్వారా ఐశ్వర్యం పెరుగుతుంది. శని దోషం కూడా సూర్య భగవానుడి దయతో తొలిగిపోతుంది. మకర సంక్రాంతి రోజు సూర్యభగవానుడు శనిదేవుడి ఇంటికి చేరుకున్నప్పుడు శని దేవుడు నల్ల నువ్వులతో స్వాగతం పలికాడని చెబుతుంటారు. 

Also Read :   వావ్.. చిరుతలా పరుగెత్తి.. డైవ్ చేస్తూ గాలిలో ఇషాన్ క్యాచ్..!

బెల్లం  : 

సంక్రాంతి 2023

సంక్రాంతి 2023

మకర సంక్రాంతి పండుగ రోజు బెల్లం దానం చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది. బెల్లం దానం మూడు గ్రహాలు అయినటువంటి సూర్యుడు, బృహస్పతి, శని దోషాలను తొలగిస్తుంది. బృహస్పతి గ్రహానికి ఇది సంబంధించిందిగా పరిగణించబడుతుంది. సూర్యుడు బలంగా ఉండడానికి బెల్లం దానం చేస్తారు. బెల్లం ఒక్కటే కాకుండా బెల్లంతో కలిపి నల్ల నువ్వులు, లడ్డులు కలిపి ఎక్కువగా దానం చేస్తుంటారు.  

Advertisement

Also Read :   ఆ సీన్ సరిగా రాలేదని హీరోయిన్ జుట్టు పట్టి చెంపపై కొట్టిన మోహన్ బాబు..!!

దుప్పట్లు  : 

Manam News

సంక్రాంతి పండుగ రోజు సంక లేవకుండా చలి పెడుతుందని మన పెద్దలు చెబుతుంటారు. మకర సంక్రాంతి పండుగ శీతాకాలం కావడంతో పండుగ సందర్భంగా పూజ చేసిన తరువాత పేదలకు వారి శక్తికి అనుగుణంగా దుప్పట్లను, వెచ్చని వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో రాహు గ్రహానికి సంబంధించిన దోషం తొలిగిపోయి సానుకూల ప్రభావం కనిపిస్తోంది. 

నల్ల పప్పు, బియ్యం పప్పు  :

సంక్రాంతి పండుగ రోజు నల్ల పప్పు, బియ్యంతో చేసిన కిచిడిని దానం చేస్తే శని, బుధ, గురు వంటి గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. నల్లపప్పుతో ఆకుపచ్చ పప్పు బుధుడుతో సంబంధం కలిగి ఉంటుంది. అన్ని గ్రహాల దోషాలను తొలగిపోవడం వల్ల మీకు విజయం సంభవిస్తుంది. 

Also Read :  వెల్లుల్లికి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఒకవేళ తింటే అంతే సంగతులు..!

అన్నదానం : 

Manam News

సాధారణంగా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటుంటారు. ఇక మకర సంక్రాంతి రోజు అన్నం దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. అన్నం చంద్రుడికి ప్రతీక. చంద్రుడిని ఇది బలపరుచుతుంది. జీవితంలో సుఖ, సంతోషాలుంటాయి. అన్నదానంతో చంద్ర దోషం తొలగిపోతుంది.  

Also Read :  మన దేశంలో రహస్యాలు దాగి ఉన్న దేవాలయాల గురించి మీకు తెలుసా ?  

Visitors Are Also Reading