Home » ఆర్థిక సమస్యలా.. పటికబెల్లంతో ఇలా చేస్తే డబ్బు సమస్యే రాదు..!!

ఆర్థిక సమస్యలా.. పటికబెల్లంతో ఇలా చేస్తే డబ్బు సమస్యే రాదు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలా మందికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. డబ్బులకు సంబంధించిన సమస్యలను అధిగమించి డబ్బులు అలాగే ఉండాలంటే ఒక చిన్న పరిహారాన్ని పాటించాలి. ఒక చిన్న పటిక ముక్కను తీసుకొని దాన్ని దంచి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ని మనం ప్రతి రోజు ఉదయం లేవగానే బ్రష్ చేసుకునేటప్పుడు కొంచెం పౌడర్ ని బ్రష్ కి పెట్టి పళ్ళకు రాసుకొని ఒక పది నిమిషాల తర్వాత దాన్ని బయటకు ఉమ్మండి. దీనివల్ల మన వాక్కు శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే మనం ఏ బిజినెస్ చేసినా కూడా మనం మన మాటలతోనే మొదలుపెడతాం.

Advertisement

Advertisement

కాబట్టి దీనివల్ల ధనానికి సంబంధించిన సమస్య తొలిగిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకు డబ్బు రాబడి పెరుగుతుంది. ధన సమస్యలు తీరుతాయి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేయాలి.దీన్ని ఖచ్చితంగా అష్టమి రోజు స్టార్ట్ చేయాలి. ఒక వేళ బుధవారం అష్టమి వస్తే అది బ్రహ్మాండమైన రోజు. ఆ రోజే ఈ పనిని మొదలు పెట్టాలి. ఈ విధంగా చేస్తే డబ్బు సంపాదించుకోవడంలో చాలా మేలు జరుగుతుంది.

అప్పుగా ఇచ్చిన డబ్బులు రాకపోయినా, ఒకవేళ మనం డబ్బులు అప్పుగా అడిగినా ఎక్కడా దొరకకపోతే ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా పటికి పౌడర్ తో వారానికి రెండు మూడు సార్లు బ్రష్ చేసుకుంటే దినదినాభివృద్ధి గా డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఇలాంటి పరిహారం గనుక చేస్తే అసలు డబ్బు సమస్యే రాదు. మన స్థోమత కు తగ్గట్టు ఎంత డబ్బు అవసరమో అంత డబ్బే మనకు సమయానికి అందుతుంది. ఇలా పాటిస్తే గనుక మనం ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వస్తాయి.

Visitors Are Also Reading