Home » మూత్రం పోస్తుంటే నురగ వస్తుందా.. అయితే ఆ ప్రాబ్లం ఉన్నట్టే..?

మూత్రం పోస్తుంటే నురగ వస్తుందా.. అయితే ఆ ప్రాబ్లం ఉన్నట్టే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మూత్రం అనేది మన ఆరోగ్యం ఎలా ఉందో చూపిస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు. మనం మూత్రానికి వెళ్లినప్పుడు యూరిన్ స్పష్టంగా వస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. కానీ మూత్రం దుర్వా సనతో, ముదురు రంగులో వస్తే మాత్రం శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టే అని గమనించాలి. ఒక్కోసారి మీరు ఎక్కువ ఫోర్సుతో మూత్రం పోసినప్పుడు బుడగలు కూడా వస్తాయి. ఇలాంటి సందర్భాలలో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ప్రతిరోజూ బుడ గలు వస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

ఇలా మూత్రంలో నురగ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. అవేంటంటే..? మూత్రంలో నురగ వస్తోంది అంటే ఢీ హైడ్రేషన్ కారణం కావచ్చు. డీహైడ్రేషన్ అయినప్పుడు మూత్రంలో ప్రోటీన్లు,కొన్ని రసాయనాలు అధిక స్థాయిలో పెరుగుతాయి. దీని నివారణకు నీరు ఎక్కువగా తాగాలి. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలకు నురుగతో కూడిన మూత్రం రావడం కామన్.

Advertisement

Advertisement

గర్భధారణ సమయంలో ఊపిరితిత్తుల్లో అధిక భారం ఉండటం వల్ల ప్రోటీన్ మూత్రం లోకి వెళ్లడం వల్ల నురగ రావచ్చు. ఒక్కోసారి అధిక ఒత్తిడి, ఆందోళన చెందినప్పుడు మీ మూత్రం బుడగలు లేదా నురగలా వస్తుంది. మధుమేహం కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపించి మూత్రం నురగ రావడానికి కారణం అవుతుంది. అధిక బ్లడ్ షుగర్ స్థాయి మూత్రపిండాలకు హాని చేస్తుంది. మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటే దానిని “ప్రోటీనురియా” అంటారు.

also read;

15 కోట్ల ఆఫర్ వద్దనుకున్న కొరటాల.. ఎందుకు…?

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా…? ఇలా అయితే ఎలా జ‌క్క‌న్న అంటూ ట్రోల్స్..!

Visitors Are Also Reading