Home » టాయిలెట్ ఆపితే మెదడు మీద ప్రభావం పడుతుందా…? సాక్సులు వేసుకుని పడుకోవడం మంచిది కాదా…?

టాయిలెట్ ఆపితే మెదడు మీద ప్రభావం పడుతుందా…? సాక్సులు వేసుకుని పడుకోవడం మంచిది కాదా…?

by Venkatesh
Ad

మనం కావాలని లేదా తెలియక చేసే కొన్ని పిచ్చి పనులు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొందరికి చెప్పినా సరే ఆ విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయరు అనే మాట వాస్తవం. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక మనం తెలిసి తెలియక చేసే తప్పులు మెదడు మీద ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం.

మెదడుకు హాని కలిగించే అతి పెద్ద అలవాట్లను ఒక్కసారి చూస్తే… అల్పాహారం సరైన సమయంలో తీసుకోకపోతే మెదడు మీద ప్రభావం పడుతుంది. ఆలస్యంగా నిద్రపోయినా లేదా తక్కువ నిద్రపోయినా సరే. అధిక చక్కెర వినియోగం కూడా ఏ మాత్రం మంచిది కాదు. (పురుషులు : రోజుకు 150 కేలరీలు. 37.5 గ్రాములు లేదా 9 టీస్పూన్లు మాత్రమే తీసుకోవాలి. మహిళలు: రోజుకు 100 కేలరీలు. 25 గ్రాములు లేదా 6 టీస్పూన్లు.) మాత్రమే తీసుకోవాలి.

Advertisement

Advertisement

ముఖ్యంగా చాలామంది ఉదయాన్నే ఎక్కువగా నిద్రపోవడం కూడా మెదడు మీద ప్రభావం చూపించే అంశం. టెలివిజన్ లేదా కంప్యూటర్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదు. నిద్రిస్తున్నప్పుడు క్యాప్ స్కార్ఫ్ లేదా జత సాక్స్ ధరించడం మంచిది కాదు. మూత్రాన్ని నిరోధించడం లేదా ఆపడం అలవాటు చేసుకుంటే మెదడు మీద ప్రభావం పడుతుంది. (మూత్రాన్ని ఎక్కువ సమయం పాటు పట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ అలవాట్లు అన్నీ కూడా డైరెక్ట్ గా మెదడు పై ప్రభావం చూపించవు. అంతిమంగా నష్టపోయేది మెదడు.

Visitors Are Also Reading