Home » Jabardasth : జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఇక రోజా స్థానాన్ని భ‌ర్తీ చేసేది ఎవ‌రో తెలుసా..?

Jabardasth : జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఇక రోజా స్థానాన్ని భ‌ర్తీ చేసేది ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

రోజా గురించి తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె సినిమా హీరోయిన్‌గా ఎన్నో ఏళ్ల పాటు అగ్ర‌క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా పేరుపొందారు. సినిమాల‌తో బుల్లితెర‌పై కూడా రాణించారు. జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రారంభం నుంచి మొన్న‌టి వ‌ర‌కు రోజా జ‌డ్జీగా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌లే రోజాకు ఏపీ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కిన విష‌యం తెలిసిన‌దే.

Advertisement

ముఖ్యంగా రోజా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌రువాత ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్న‌ప్పుడు కానీ.. ఆ త‌రువాత వైసీపీలోకి మారిన త‌రువాత కానీ.. ప్ర‌త్య‌ర్థుల‌పై ఆమె విరుచుకుప‌డిన తీరు ఓ రేంజ్‌లో ఉంటుంది. మంత్రి ప‌ద‌వీ ద‌క్కించుకున్నందుకు ఎమ్మెల్యే రోజా సంతోషం వ్య‌క్తం చేసారు. మినిస్ట‌ర్ అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాన‌ని చెప్పారు. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చేయ‌ను అని.. ఇక‌పై జ‌బ‌ర్ద‌స్త్ షోలో కూడా పాల్గొన‌ను అని చెప్పారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేవిధంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తాన‌ని చెప్పారు.

Advertisement

కొత్త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజా పేరును సీఎం ప్ర‌క‌టించ‌గానే.. రోజా జ‌బ‌ర్ద‌స్త్‌, సినిమాల్లో న‌టించిను అని ప్ర‌క‌టించింది. ఇక రోజా స్థానంలో మ‌హిళా జ‌డ్జీగా ఎవ‌రు వ‌స్తార‌నే విష‌యంపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఈ త‌రుణంలోనే ఒక పేరు అయితే బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఎగిరే పావుర‌మా..? సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన హీరోయిన్ లైలా ఇక‌పై జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జీగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే సంకేతం ఇచ్చింది. మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్.. ఇటీవ‌ల విడుద‌లైన ప్రోమోలో రోజాతో పాటు న‌టి ఆమ‌ని, లైలాకు కంటెస్టెంట్స్ చేసే స్కిట్‌ల‌ను ఎలా రిసీవ్ విడుద‌లైన ప్రోమోలో రోజాతో పాటు న‌టి ఆమ‌ని, లైలాకు కంటెస్టెంట్స్ చేసే స్కిట్‌ల‌ను ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఎలా కామెంట్ చేయాలి.

ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాల‌నే విష‌యాల‌పై రోజా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా గ‌మ్మ‌త్తేంటంటే ఈ ప్రోమోలో ఆమ‌ని నువ్వు జ‌డ్జీగానే ఉన్నావుగా మ‌ళ్లీ ఎందుకు అని రోజా అంటే నేను బాగా చేస్తే లైలాను ఎందుకు పిలుస్తార‌ని చెప్పింది. దీనిని బ‌ట్టి చూస్తే ఆమె పొజిష‌న్‌లో సొట్ట బుగ్గ‌ల హీరోయిన్ లైలా నెక్ట్స్ జ‌డ్జీ అని తేలిపోయింది. లైలా కాదంటే ఆమ‌ని.. ఇంద్ర‌జ శ్రీ‌దేవి డ్రామా కంపెనీకి న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు రోజా త‌ప్పుకుంటే ఆ స్థానాన్ని ఇంద్ర‌జ కూడా ఆక్ర‌మించే ఛాన్స్ ఉంది. దీనిపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. అయితే నూటికి నూరు శాతం లైలానే ఈ షోకు జ‌డ్జీగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని పేర్కొంటున్నారు. ఇక మ‌రి ఆ స్థానంలోకి ఎవ‌రు వ‌స్తారో వేచి చూడాలి.

Also Read :  నాగార్జున మేన‌కోడ‌లు, ప‌వ‌న్ హీరోయిన్ సుప్రియ‌….ఇప్పుడు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారో తెలుసా..!!

Visitors Are Also Reading