Home » డబ్బు కోసం యాంకర్ సుమ కూడా ఇలా చేస్తుందా..?

డబ్బు కోసం యాంకర్ సుమ కూడా ఇలా చేస్తుందా..?

by Anji
Ad

యాంకర్ సుమకు బుల్లితెరపై ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె పేరుకు మలయాళీ అయినా తెలుగులో అనర్గళంగా టకటక మాట్లాడుతుంది. ఎదుటివారికి అస్సలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వని సుమ ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది. ఓ వైపు పలు షోలు చేస్తూనే.. మరోవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అంతేకాదు..  బుల్లితెరపై కూడా  పలు షోలకు నిర్మాతగా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఈటీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన సుమ రీసెంట్ గా క్యాష్ ప్రోగ్రామ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

ఇక ఆ షోకి బదులుగా సుమ ‘అడ్డా’ అనే సరికొత్త ప్రోగ్రాం మొదలు పెట్టింది. అయితే ఈ షో జనాలకు అంతగా నచ్చలేదు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ షో లో సుమ యాంకరింగ్ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. అయితే ఈ షోకు సుమనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే సుమ మిగతా షోలకన్నా ఎక్కువగా ఈ షోపై కాన్ సెంట్రేషన్ చేస్తూ షోను ముందుకు తీసుకెళుతుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్ లో చిరంజీవి వచ్చినప్పుడు సుమ ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే.  అడ్డా షోకి మెగాస్టార్  చిరంజీవి వచ్చినప్పుడు సుమ విపరీతంగా పొగిడేసింది.

Advertisement

Advertisement

Also Read :  దర్శకుడు రాజమౌళి తీసుకునే పారితోషికంతో ఎక్కువ దేని కోసం ఖర్చు చేస్తారో తెలుసా ?

Manam News

ఈ రేంజ్ లో పొగడడం ఇప్పటివరకు ఎప్పుడూ కూడా చూడలేదనే చెప్పవచ్చు. మాటకు ముందు.. మాట వెనక చిరంజీవిని బాగా పొగిడింది. చిరంజీవి గొప్పవాడే.. కానీ సుమ ఈ రేంజ్ లో ఓవరాక్షన్ చేయడం అస్సలు బాగాలేదు. అంతేకాదు రీసెంట్ ఎపిసోడ్ లో  శేఖర్ మాస్టర్, జాని మాస్టర్ వచ్చినప్పుడు కూడా అంతే ఓవరాక్షన్ చేసింది. మిగతా షోలలో ఎప్పుడూ కూడా సుమ ఇంతగానం ఓవరాక్షన్ చేయలేదు. కానీ ఈ షోలో ఎక్కువ ఓవరాక్షన్ కనిపిస్తుంది. దీంతో తన సొంత షో కాబట్టి డబ్బులు సంపాదించుకోవడం కోసం సుమ లిమిట్స్ దాటుతూ యాంకరింగ్ చేస్తుందని ప్రేక్షకులు పేర్కొంటున్నారు.

Also Read :   Jr..ఎన్టీఆర్ ను ఇంట్లో పిలిచే నిక్ నేమ్ ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading