Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అప్పిచ్చాడు.. లేట్ అయిందని కోరిక తీర్చమన్నాడు..అందమైన అమ్మాయి బాధ..!

అప్పిచ్చాడు.. లేట్ అయిందని కోరిక తీర్చమన్నాడు..అందమైన అమ్మాయి బాధ..!

by Sravanthi Pandrala Pandrala
Ads

అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్ల రోడ్లపై నుంచి ఏమి కాకుండా ఇంటికి వస్తే మనకు పూర్తిస్థాయి స్వాతంత్రం వచ్చినట్టు అని పెద్దలు అన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి దేశంలో కనిపిస్తోంది కానీ అక్కడక్కడ చాలామంది ఆడపిల్లలు మగాళ్ళ చేతిలో ఇబ్బందులకు గురవుతున్నారు. అది కాలేజీలలో కావచ్చు, ఉద్యోగాలు చేసే దగ్గర కావచ్చు, ఇతర పనులు చేసే ప్రాంతాల్లో కావచ్చు. ఆడపిల్ల కాస్త చనువుగా మాట్లాడితే చాలు వారిని ఏ విధంగా అయినా లోబర్చుకొని వాడేసుకోవాలని చూసే సమాజం ఇప్పుడు ఉంది.

Advertisement

Ad

అలా ఈ అమ్మాయిని అప్పిచ్చి లొంగదీసుకోవాలనుకున్నాడు.. పూర్తి వివరాలు చూద్దామా.. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం ముదక్ పల్లి గ్రామానికి చెందిన గౌతమి (21)నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఉన్న మనోరమ ఆస్పత్రి నర్సుగా చేస్తారు. అయితే ఇంటి అవసరాల నిమిత్తం ఆమె డాక్టర్ వద్ద రూ. 80,000 అప్పు తీసుకొని. ప్రతి నెల జీతంలో 5000 కట్ చేసుకుని ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇదంతా పక్కన పెడితే.. తన అప్పు మొత్తం ఒక్కసారే చెల్లించాలని నర్స్ పై ఒత్తిడి తెచ్చాడు డాక్టర్.. ఆమెని చాలా టార్చర్ పెడుతూ వచ్చారు.

ఒకవేళ డబ్బులు లేవంటే నా కోరిక తీర్చాలని నా పక్క లోకి రావాలని అడిగారట. దీంతో మనోవేదన తట్టుకోలేక గౌతమి ఉరివేసుకొని మరణించింది. ముందుగా ఆస్పత్రికి ఫోన్ చేసి డాక్టర్లు సిబ్బందితో మాట్లాడి తాను చనిపోతున్నట్లు సమాచారం అందించింది. ఈ విషయాన్ని వెంటనే తన తోటి నర్సులు వారి ఇంటికి తెలియజేశారు. కానీ వీరు ఘటన స్థలానికి చేరుకునే సమయానికే ఆమె మరణించింది. దీంతో తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించి నిరసనగా దిగారు. డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :

 

 

Visitors Are Also Reading