మెగాస్టార్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా మారిపోయారు. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాత్ చేతుల మీదుగా రామ్ చరణ్ లాంచింగ్ చిరుత సినిమాతో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. కానీ చరణ్ తన డ్యాన్స్ నటనతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తరవాత చరణ్ లక్కుతోక తొక్కాడు. రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తరవాత చరణ్ స్టార్ హీరోగా మారిపోయాడు. త తరవాత కొన్ని ఫ్లాపులు చరణ్ ను వెంటాడాయి. ఇక నటుడిగా రామ్ చరణ్ ను నిలబెట్టిన సినిమా రంగస్థలం..ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్ కు సరిగ్గా నటించడం రాదని టాలీవుడ్ లో ఓ టాక్ ఉండేది. కానీ రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ట్రోలర్స్ నోర్లను మూయించాడు.
ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తరవాత బాలీవుడ్ హీరోయిన్ లు సైతం చరణ్ కు జోడీగా నటించాలని ఉందని చెబుతున్నారు. అంతే కాకుండా చరణ్ కు బాలీవుడ్ ఆఫర్ లు కూడా వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ బయట ట్రెండీగా కనిపిస్తుంటారన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రామ్ చరణ్ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఓ లెదర్ జాకెట్ తో దర్శనమిచ్చాడు.
లెదర్ జాకెట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడంతో దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆ లెదర్ జాకెట్ ధర ఎంత అని నెటిజన్లు వెతుకున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం చరణ్ ధరించిన లెదర్ జాకెట్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.2లక్షల వరకూ ఉంటుందట. అంతే కాకుండా చరణ్ షూ ధర కూడా 40వేల వరకూ ఉంటుందట.