సాధారణంగా బరువు తగ్గడానికి రకరకాల డైటింగ్ లు చేస్తుంటారు. గంటల తరబడి జిమ్ములో సమయాన్ని స్పెండ్ చేస్తుంటారు. అయినా ఏమాత్రం బరువు తగ్గరు. దీంతో నిరాశకు గురై వెయిట్ లాస్ ప్రయాణాలు ప్రయత్నాలు మానేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ జర్నీలో చేసే కొన్ని తప్పుల కారణంగా ఎంత ప్రయత్నించినప్పటికీ బరువు తగ్గరు అని నిపుణులు పేర్కొంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కొంతమంది ఆహారం తినడం మానేస్తే బరువు తగ్గుతామని అనుకుంటూ ఉంటారు. అయితే అది అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిరంతరం ఆకలేయడం మొదలవుతుంది. చిరు తిండ్లు ఎక్కువగా తినేలా చేస్తుంది. దీంతో కొవ్వు కరగదు. బరువు కూడా తగ్గదు. తినడం మానేస్తే శరీరానికి అవసరమయ్యే పోషకాలను కోల్పోతుంది. దీంతో మొత్తం ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. మీ డైట్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు మినరల్స్ విటమిన్లు ప్రోటీన్లతో సమస్యలు ఆహారాన్ని చేర్చుకోండి. ఇవి మీ శరీరానికి పోషకాలు అందించడంతోపాటు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి.
Advertisement
కొందరు బరువు త్వరగా తగ్గాలని ఆసక్తితో ఎక్కువసేపు వర్కౌట్లు చేస్తుంటారు. అయితే ఈ ఆలోచన మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వర్కౌట్స్ ఎక్కువ చేస్తే కేలవరిలో తగ్గడం అటు నుంచి శరీరం అలసిపోయి అసలు దేనికి సహకరించదు. నీళ్లు సరిగ్గా తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది. దీంతో ఆకలి కూడా వేస్తుంది. దీంతో మనసు చిరుతిండి వైపు లాగుతుంది. మన శరీర పనితీరు మెరుగ్గా జరగాలంటే శరీరంలో శక్తి స్థాయిలు పెరగాలన్న, కండరాలు బలవృతం కావాలన్నా, శరీరం నుంచి వ్యర్ధాలు తొలగాలన్న సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. అప్పుడే జీవక్రియ రేటు పెరిగి శరీరంలో కొవ్వు కరుగుతుంది. ప్రశాంతమైన నిద్ర శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసుకొని వ్యాయామాలకు తగినట్టుగా సహకరిస్తుంది. లేదంటే వర్కౌట్లు చేసే సమయంలో శక్తి హీనంగా మారి తగినంతసేపు వ్యాయామాలను చేయనీయదు. మీరు వెయిట్ లాస్ జర్నీ సక్సెస్ కావాలంటే రోజుకు 7 నుంచి 8 గంటలవ వరకు నిద్ర పోవడం చాలా ముఖ్యం.
Also Read : ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు పాలతో చేసిన టీ తాగకూడదా..?