Home » షుగర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ పండు తింటే ఇట్టే నయం అవుతుంది..!!

షుగర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ పండు తింటే ఇట్టే నయం అవుతుంది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

షుగర్ వ్యాధి వచ్చిన తరువాత రక్తంలో చక్కెర స్థాయి కొంతమందికి కంట్రోల్ తప్పి ఎంత ఎక్కువ ఉంది అనేది మూడు నెలల యావరేజ్ టెస్ట్ HbA1c చూసుకుంటే కొంతమందికి 8,9,10 ఇలా 15 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా అన్ కంట్రోల్ గా డయాబెటిస్ ఉన్నవారికి శరీరంలో అవయవాలన్నీ కూడా నిదానంగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మరి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఆహార నియమాలు చాలా అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మామూలుగా షుగర్ పేషెంట్లు పండ్లు తింటే చక్కెర స్థాయి పెరుగుతుందని పండ్లు తినరు. కానీ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి పండ్లు కూడా స్పెషల్ గా ఉంటాయి. ఆ పండ్లలో ముఖ్యంగా బత్తాయి పండు ఒకటి. దీన్ని తినడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ వెంటనే కంట్రోల్ లోకి వస్తాయని 2016 సంవత్సరంలో ఇంటిగ్రల్ యూనివర్సిటీ లక్నో వారు స్పెషల్ గా దీనిమీద పరిశోధన చేసి నిరూపించారు. ఈ బత్తాయిల్లో హెస్పరిడిన్, నారింజిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది ఒక లివర్ లోనే కాకుండా మొత్తం శరీరంలో ఉండే కణజాలం యొక్క తలుపులు తొందరగా తెర్చుకునేటట్లు చక్కెర వాటి లోపలికి వెళ్ళేటట్లు ఈ నారింజన్, హెస్పరిడన్ అనేవి తోడ్పడతాయి.ఇన్సులిన్ రెసిస్టన్స్ ఒక లివర్ లోనే తగ్గించడం కాకుండా శరీరంలో ఉండే అన్ని కణజాలాలలోని అన్ని అవయవాల్లో ఇన్సులిన్ రెసిస్టన్స్ తొలగించడానికి బత్తాయిలు ఉపయోగపడుతున్నాయని నిరూపించబడింది. కానీ షుగర్ ఉన్నవారు బత్తాయి రసాన్ని తాగ కూడదు. కేవలం దాన్ని ఒలుచుకొని మాత్రమే తినాలి. ఇలా తింటే బత్తాయి లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అలాగే ఫైబర్ ఎక్కువ మొత్తంలో మన శరీరం లోకి వెళుతుంది. ఇది రక్తంలోపలికి చక్కెర స్థాయిలు ఎక్కువగా వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి ఫైబర్,బ్లడ్ లోకి వెళ్లే చక్కెర కణంలోపలికి వెళ్ళేటట్లు హెస్పరిడన్, నారింజన్ అనే రెండు కెమికల్స్ చక్కగా ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధి అన్ కంట్రోల్ గా ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బత్తాయిలను ఒలుచుకొని తినడం మంచిది. సాయంత్రం డిన్నర్ లో కూడా అన్నం కాకుండా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది.

Advertisement

ALSO READ;

Advertisement

నేరేడుపండును వారు అస‌లు తిన‌కూడ‌ద‌ట‌..!

విజృంభిస్తున్న మంకీ ఫాక్స్ .. లక్షణాలు ఇవేనా..?

 

Visitors Are Also Reading