Home » షుగర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ నేరేడు పండ్లు ఎంతో మేలు..!

షుగర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ నేరేడు పండ్లు ఎంతో మేలు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం వానాకాలం కాబట్టి మార్కెట్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఏ సీజన్లో ఆ పండ్లను తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాం.. ప్రస్తుత సీజన్లో ఎక్కువగా కాసే పండ్లు నేరేడు పండ్లు.. మరి ఈ పండ్లతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం..?
నేరేడు పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు గొప్ప వరంగా చెప్పవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారు నేరేడు పండ్లు కొన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దేహంలోని చక్కెర శాతాన్ని ఇట్టే తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే ఆలే యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరంలోని క్యాన్సర్ కారకాలు వృద్ధి కాకుండా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సోడియం, పొటాషియం, కాల్షియం, పాస్ఫరస్,మాంగనీస్,జింకు, పోలిక్ ఆసిడ్ లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. నేరేడు పండ్లను తినడం వల్ల దంత సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఈ పండ్లు దంతాలను,చిగుళ్లను బలంగా చేస్తాయి.నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో పుండ్లను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ నేరేడు పండ్లు పురుషుల్లో శృంగార శక్తిని పెంచుతాయి. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. కడుపుబ్బరం మరియు ఇతర సమస్యలను తొలగిస్తుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులను కూడా తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఈ సీన్స్ డిలీట్ చేసి తప్పు పని చేసారా ? ఆ హీరోకి అన్యాయమే జరిగిందిగా !

సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఏ మూవీకి ఎక్కువ పారితోషికం తీసుకున్నారో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading