Home » సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్‌, గుండె జబ్బులు ఖాయం..?

సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్‌, గుండె జబ్బులు ఖాయం..?

by Anji
Ad

సోష‌ల్ మీడియా మూలంగా క‌లిగే ప్ర‌మాదాల గురించి హెచ్చ‌రిస్తూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక వైద్య అధ్య‌య‌నాలు, ప‌రిశోధ‌నాలు జ‌రుగుతున్నాయి. సోష‌ల్ మీడియాలో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే వారిలో డిప్రెష‌న్, యాంగ్జ‌యిటీ, ఆత్మ‌హ‌త్య ధోర‌ణులు పెరుగుతున్నాయ‌ని అనేక అధ్య‌య‌నాల్లో వెల్ల‌డి అయింది. సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్, హృద‌య సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని చెబుతున్న మొద‌టి అధ్య‌య‌నం ఇది. ఎందుకంటే ఈ అధ్య‌య‌నంలో వైద్యులు వారి శ‌రీరంలో నిర్థిష్ట ర‌కం ప్రోటీన్ ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. సోష‌ల్ మీడియాలో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే వారి సంఖ్య రోజుకు విప‌రీతంగా పెరుగుతుంది.

Advertisement

 

Also Read : సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట విషాదం

సైబ‌ర్ సైకాల‌జీ బీహేవీయ‌ర్ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించ‌బ‌డిన ఈ అధ్య‌య‌నం 18 నుంచి 24 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు గ‌ల 251 మందిపై అధ్య‌య‌నం గురించి చెబుతుంది. ఈ అధ్య‌యనానికి బ‌ఫెలో విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ డేవిడ్ లీ నాయ‌కత్వం వ‌హించారు. అక్క‌డ సామాజిక ప‌ర‌స్ప‌ర చ‌ర్య‌, మాన‌వ సంబంధాల‌ను బోధిస్తారు. మాన‌వ మ‌న‌స్సు, శ‌రీరం అంటే మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యం డేవిడ్‌లీ చెప్పారు. మ‌నం ఏమ‌నుకుంటున్నామో అది నేరుగా మ‌న శారీర‌క ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తుంద‌ని చెప్పారు. ఏదైనా కార‌ణం వ‌ల్ల మ‌నుషుల్లో డిప్రెష‌న్ పెరిగిపోతే అది వారి శారీర‌క ఆరోగ్యంపైనా ప్ర‌భావం చూపుతుంద‌న్నారు.

Advertisement

అధ్య‌య‌నంలో సోష‌ల్ మీడియాలో పావువంతు కంటే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న యువ‌త‌లో వారి శ‌రీరంలో ఒక నిర్థిష్ట ర‌కం ప్రోటీన్ ప‌రిమాణం పెరిగిన‌ట్టు క‌నుగొన్న‌ట్టు చెప్పారు. భ‌యంక‌ర‌మైన సంకేతం ఎందుకంటే.. ఈ ప్రోటీన్ అధికంగా ఉంటే హృద‌యం సంబంధ వ్యాధుల‌కు దీర్ఘ‌కాలంలో క్యాన్స‌ర్‌కు కూడా దారి తీస్తుంద‌న్నారు. సోష‌ల్ మీడియా పూర్తిగా చెడ్డ‌ది చెప్ప‌డం లేద‌ని కానీ మితి మీరిన‌ది క‌చ్చితంగా ప్ర‌మాద‌క‌రం అన్నారు. సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే జీవించే వ్య‌క్తులు నిజ జీవిత సంబంధాల‌ను కోల్పోతార‌ని హెచ్చ‌రించారు. అదేవిధంగా సోష‌ల్ మీడియాలో ఎక్కువ సేపు గ‌డిపితే ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావాలు ఉంటాయ‌ని త‌ద్వారా ర‌క‌ర‌కాల రోగాలు చుట్టుముడుతాయ‌ని వెల్ల‌డించారు.

Also Read : పుష్ప పార్ట్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్ …ఎప్పుడంటే….!

Visitors Are Also Reading