Home » చిన్న వయస్సులోనే హార్మోనియం వాయిస్తున్నఈ పాప ఎవరో గుర్తు పట్టారా..? 

చిన్న వయస్సులోనే హార్మోనియం వాయిస్తున్నఈ పాప ఎవరో గుర్తు పట్టారా..? 

by Anji
Ad

సాధారణంగా తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిన తారలు చాలా మందే ఉన్నారు. ఎంత వేగంగా స్టార్ డమ్ సంపాదించుకున్నారో అంతే వేగంగా ఇండస్ట్రీ కనిపించకుండా పోతున్నారు. అందుల పలువురు సినిమాలకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీతో గడుపుతుంటే.. మరికొందరూ ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరూ అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడిప్పుడే రీ ఎంట్రి ఇస్తున్న వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఈ ఫోటోలో హార్మోనియం వాయిస్తున్నటువంటి ఈ చిన్నారి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. 

Advertisement

తొలి సినిమాతోనే అందం, అభినయంతో కట్టి పడేసింది. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హారోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వెన్నెలమ్మ నయనం.. చూడగానే ఆకట్టుకోగానే అందంతో వెండితెరపై సందడి చేసింది. ఎంట్రీతోనే సూపర్ హిట్ సాధించిన ఈ అమ్ముడు.. ఆ తరువాత నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అరకొర సినిమాల్లో నటించినా ఫలితం దక్కకపోవడంతో.. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడిప్పుడే మెల్లగా తిరిగి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ఇంతకు ఎవరో ఈ హీరోయిన్ ని గుర్తుపట్టండి చూద్దాం. 

Advertisement

Also Read :  సంక్రాంతి పండుగ రోజు ఈ పని చేస్తే శని నుంచి విముక్తి పొందవచ్చు..!

ఈ హీరోయిన్ మరెవ్వరో కాదండోయ్.. కొత్త బంగారు లోకం సినిమాతో కుర్రాళ్ల మనస్సు దోచుకున్నటువంటి హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. ఈ సినిమాతో భారీ ఫాలోయింగ్ నే సంపాదించుకుంది. ఇక ఆ తరువాత పలు చిత్రాలలో నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అవి డిజాస్టర్ గానే నిలిచాయి. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కాస్కో, రైడ్, కలవర్ రాజు, నువ్వక్కడుంటే నేనక్కడుంట వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది శ్వేత బసు. ఇటీవలే క్రిమినల్ జస్టిస్ సీజన్ 3 వెబ్ సిరీస్ లో నటించింది. ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో కనిపించింది. తన స్నేహితులతో కలిసి పార్టీలో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసింది శ్వేత బసు ప్రసాద్. 

Also Read :  భారత్ లో అత్యంత ధనవంతులైనటువంటి దర్శకులు వీళ్లే..!

Visitors Are Also Reading