Home » విజయశాంతితో ఉన్న ఈ బాలుడిని గుర్తు పట్టారా..? టాలీవుడ్ ఇప్పుడు టాప్ హీరో..!

విజయశాంతితో ఉన్న ఈ బాలుడిని గుర్తు పట్టారా..? టాలీవుడ్ ఇప్పుడు టాప్ హీరో..!

by Anji
Published: Last Updated on
Ad

అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న అందాల తార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. గ్లామర్ పాత్రలు పోసిస్తూనే ఓసెయ్ రాములమ్మ, భారతరత్న, రౌడీ దర్బార్, కర్తవ్యం వంటి లేడీ ఓరియేంటేడ్ సినిమాలు తీసిన ఘనత విజయశాంతి సొంతం. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఆమెకు లేడీ అమితాబ్ అనే బిరుదు కూడా ఉంది. జూన్ 24న విజయశాంతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కింద ఉన్న ఫోటో కూడా అలాంటిదే.. ఈ ఫొటోలో విజయశాంతితో కలిసి ఉన్న పిల్లాడి ఫొటోను మీరు గుర్తు పట్టారా..? 

Advertisement

ప్రస్తుతం అతను టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ హీరోల్లో ఒకరు. పాన్ ఇండియా కాదు.. ఏకంగా ఇటీవల గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇటీవలే తండ్రిగా కూడా ప్రమోషన్ పొందాడు. ఇక ఈ పాటికి అర్థం అయ్యే ఉంటుంది అందరికీ. మనం ఎవ్వరి గురించి మాట్లాడుకుంటున్నామో.. ఆ పిల్లాడు.. మరెవ్వరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా సెట్ లో తీసిన ఫొటో ఇది. 

Advertisement

Ram Charan

 

 

అప్పట్లో చిరంజీవి, విజయశాంతి కాంబోలో చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ లో వీరికి మంచి సక్సెస్ ఫుల్ జోడీగా పేరు ఉంది. అయితే ఏమైందో ఏమో తెలియదు.. కానీ గ్యాంగ్ లీడర్ మూవీ తరువాత చిరంజీవి, విజయశాంతి కలిసి పెద్దగా సినిమాలు చేయలేదు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అక్కడ వారిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.  వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటున్నారు విజయశాంతి. చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో నటిస్తున్నాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రాజమౌళి-మహేష్ మూవీపై మైండ్ బ్లాస్టింగ్ అప్డేట్.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే..?

కొత్త కారు కొనుగోలు చేసిన మహేష్ బాబు.. హైదరాబాద్ లో ఫస్ట్ ఇదే..!

Visitors Are Also Reading