Home » చిరు “ఆపద్బాంధవుడు” మూవీ హీరోయిన్ గుర్తుందా..ఇప్పుడెలా ఉందంటే..?

చిరు “ఆపద్బాంధవుడు” మూవీ హీరోయిన్ గుర్తుందా..ఇప్పుడెలా ఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. చిరు మరియు కే విశ్వనాథ్ కాంబినేషన్లో ఎన్నో కళాత్మక చిత్రాలు వచ్చాయి. విశ్వనాథ్ కలం నుంచి జాలువారిన అద్భుతమైన చిత్రాలు, ఎన్నో పాత్రలు అభిమానులను ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఆపద్బాంధవుడు, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, స్వాతిముత్యం, సప్తపది లాంటి సినిమాలు అభిమానులకు ఎంతో కనెక్ట్ అయ్యాయని చెప్పవచ్చు. అలా చిరు మరియు విశ్వనాథ్ కాంబోలో వచ్చిన బెస్ట్ మూవీ ఆపద్బాంధవుడు.

Advertisement

 

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా ఇంకోవైపు మీనాక్షి చౌదరి కూడా తెలుగుతనం ఉట్టిపడేలా ఆకట్టుకుందని చెప్పవచ్చు. తన డాన్సులు, అందచందాలతో అప్పట్లో కుర్ర కారుకు చెమటలు పట్టించింది. 18 ఏళ్లకే మిస్ ఇండియా టైటిల్స్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా చేసిన సినిమా” బ్రహ్మశ్రీ విశ్వామిత్ర”.. ఆ మూవీతో అంతగా ఫేమ్ సంపాదించలేకపోయినా మీనాక్షి తర్వాత నటించిన “ఆపద్బాంధవుడు” మూవీతో అందరికీ చేరువైంది.

 

బాలీవుడ్ లో దాదాపు 30కి పైగా చిత్రాలు నటించింది. ఈమె 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అప్పటినుంచి ఇండస్ట్రీకి దూరమైంది. ఇక వీరికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలో సెట్ అయిపోయిన ఈ బ్యూటీ, అక్కడ టీచర్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వైరాలవడంతో ఆమెను చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతూ ఆశ్చర్యపోతున్నారు.

also read:

Visitors Are Also Reading