Telugu News » Blog » యువకుల కలల రాణి.. సోనాలి బింద్రే గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిందంటే..?

యువకుల కలల రాణి.. సోనాలి బింద్రే గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే అంటే తెలియని వారు ఉండరు. తన 19వ ఏటా సినీ కెరియర్ ను ప్రారంభించింది. ఆమె మొదటి చిత్రం ఆగ్. ఈ చిత్రం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఈ మూవీకి గాను ఫిలింఫేర్, న్యూ ఫేమస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకుంది. సోనాలి బింద్రే సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో చేసేది. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో గుర్తింపుతో పాటు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చాలా ఫేమస్ అయ్యారు. ఆమె అందానికి కుర్రాళ్ళ హృదయాలు కరిగిపోయేవీ అంటే నమ్మలేరు.

Advertisement

also read:మనిషి నవ్వడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం మీకు తెలుసా..?

ఆగ్ సినిమా తర్వాత 1994 లోని నారాజ్ మూవీ విడుదల అయింది. మళ్లీ 1996లో మరో చిత్రంలో నటించి అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కూడా ఉన్నారట. ఇక వరుసగా ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఇక తర్వాత కొన్ని కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి బొంబాయి వంటి ప్రముఖ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి మరో సంచలనాన్ని సృష్టించింది. అప్పట్లో సోనాలి కి క్రేజ్ కు, అందానికి అప్పటి హీరోయిన్స్ అంతా కుళ్ళు కునేవారట.

Advertisement

ఆ తర్వాత సినీ నిర్మాత అయిన గోల్డ్ బెల్లిని వివాహం చేసుకున్న సోనాలి, తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ మూవీ కల్మనామోతో సోనాలి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటిగా చేసుకుంటూనే, పలు షో లలో న్యాయ నిర్నేతగా చేశారు. ఆ తర్వాత సోనాలి క్యాన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లి అక్కడే కొన్ని నెలల పాటు చికిత్స పొంది క్యాన్సర్ పై విజయం సాధించింది. అలాంటి సోనాలి ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది.

Advertisement

also read: