Home » పసివాడి ప్రాణం సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ పిల్లాడు ఎవరు ? ఇప్పుడెలా ఉన్నారంటే?

పసివాడి ప్రాణం సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ పిల్లాడు ఎవరు ? ఇప్పుడెలా ఉన్నారంటే?

by AJAY
Ad

pasivadi pranam Child artist: మెగాస్టార్ చిరజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో పసివాడి ప్రాణం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. సినిమాలో మెగాస్టార్ తన నటన తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి అది అబ్బాయి పాత్ర కానీ ఆ పాత్రలో నటించింది మాత్రం అమ్మాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు.

pasivadipranam-child-artist

Advertisement

 

Pasivadi Pranam Child Actor

అంతా అబ్బాయేమో అనుకున్నారు. ఇక ఆ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు…సుజాత. పసివాడు ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా ఏకంగా ఐదు భాషల్లో సుజాత చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఏకైక నటిగా కూడా సుజాత ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

ఇక సుజాత టాలీవుడ్ లో మెగాస్టార్ తో పాటు బాలయ్య, వెంకటేష్, నాగార్జున సినిమాల్లో కూడా నటించి అలరించింది. జై చిరంజీవ సినిమాలో మళ్లీ చిరంజీవికి సోదరిగా నటించి అలరించింది. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సుజాత ఆసక్తికర విషయాలను పంచుకుంది.

పసివాడి ప్రాణం సినిమా ఐదు భాషల్లో తెరకెక్కగా అన్ని భాషల్లోనూ తానే నటించా అని తెలిపింది. ఇక ప్రస్తుతం సినిమాల తో పాటు టివి సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోలకు అక్క వదిన పాత్రలతో పాటు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తోంది. ఇప్పటికే అందం అభినయం తో టాలీవుడ్ లో రాణిస్తుంది.

Visitors Are Also Reading