తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్నోసెంట్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది కమలిని ముఖర్జీ. ఈ అమ్మడుకు చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం ఉండటంతో చదువు పూర్తి కాగానే ముంబైకి చేరింది. కమలినీ తండ్రి ఇంజనీర్,తల్లి జ్యువెలరీ డిజైనర్.. కానీ కమలినికి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండటంతో హీరోయిన్ అవ్వాలని భావించింది. అయితే ఈ అమ్మడు తెలుగు నటి రేవతి ఎయిడ్స్ గురించి తీసిన ఫిరిమిలింగే అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ 2004లో విడుదలైంది.
Advertisement
ఆ తర్వాత శేఖర్ కమ్ముల ఈ అమ్మడును చూసి ఆనంద్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు రావడం మాత్రమే కాకుండా నంది అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వచ్చాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం,హిందీ, బెంగాలీ వంటి చిత్ర పరిశ్రమల్లో కూడా పనిచేసింది కమలిని. ఇక తెలుగులో చివరి చిత్రం రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే లో చేసింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు ఎక్కడ కనిపించలేదు . 42 సంవత్సరాల కమలిని ముఖర్జీ పెళ్లి చేసుకున్నట్టు వార్తలు కూడా లేవు. మరి ఇంతకీ కమలినీ ఏం చేస్తుందో తెలుసుకుందాం. 2014లోనే ఆమె కెరియర్ ముగుస్తుంది అనుకున్న సమయంలో కమలిని తన ఇద్దరు సోదరీలతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసింది.
Advertisement
దీంట్లో అనేక బ్యూటీ వీడియోస్ పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఇది మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయింది. అలాగే బేకరీ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. బేకరీ వర్క్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అనేక రకాల బేకరీ వంటకాలను చేయడం ప్రారంభించింది. ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైన ఆమె వివిధ రకాల బిజినెస్ లతో ముందుకెళ్తోంది. ఛాన్స్ దొరికితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తుందట కమలిని.
also read:Adivi sesh:ఒక్క ఫ్యామిలీ నుంచి 10మంది హీరోలుంటే మాలాంటి వారికి ఛాన్సులు దక్కేదెలా అంటూ ఎమోషనల్..!