Home » హాస్యనటి పాకీజా గుర్తుందా.. కనీసం ఓ పూట తినడానికి దిక్కులేని పరిస్థితుల్లో రోడ్డుపై..!!

హాస్యనటి పాకీజా గుర్తుందా.. కనీసం ఓ పూట తినడానికి దిక్కులేని పరిస్థితుల్లో రోడ్డుపై..!!

by Sravanthi

ఈ మధ్యకాలంలో చాలామంది సీనియర్ నటులు కనీసం తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ రోడ్లపై ఉంటున్న పరిస్థితులు అనేకం కనిపిస్తున్నాయి.. తాజాగా అలనాడు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో చేసి, కనీసం డేట్స్ కూడా దొరకని పరిస్థితుల్లో ఉండే ఈ హాస్యనటి పాకీజా కనీసం ఒక పూట తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలోకి వచ్చింది. మరి అలా రావడానికి కారణాలు ఏంటో చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసెంబ్లీ రౌడీ మూవీతో పాకీజా పాత్ర చాలా పాపులర్ అయింది. దీని తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించింది.

also read:శాకుంతలం మూవీలో సమంతాను తీసుకోవడానికి కారణం ఆవిడే.!!

ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 150 కి పైగా సినిమాలు చేసిందట. అలాంటి ఈ నటి పరిస్థితి చాలా దారుణమైంది. పాకీజా లేడీ కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆస్తులు ఏమి సంపాదించుకోలేదట. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ లో 150 సినిమాలు చేశానని ఏఎన్ఆర్,ఎన్టీఆర్, బాలయ్య, మోహన్ బాబు ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో తెరను పంచుకున్నానని అన్నారు. ఇక సినిమాలు మానేశాక నా సొంత ఊరు అయిన కారైకుడికి వెళ్లానని, నా బెస్ట్ ఫ్రెండ్ జయలలిత అని చెప్పుకొచ్చింది.

కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందుకే ఇక్కడికి వచ్చాను అని తెలియజేసింది. 150 సినిమాలు నటించిన నేను కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయానని అన్నారు. ఎంతో మంది స్టార్ హీరోలను కలిశానని తన పరిస్థితిని చెప్పానని, చివరికి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ని కూడా కలిసి నా పరిస్థితి వివరించానని కానీ ఎవరూ కూడా హెల్ప్ చేయలేదని ఎమోషనల్ అయ్యింది. అలనాడు ఎంతో మందిని నవ్వించిన పాకీజా ఇలా దీన స్థితిలో కనబడేసరికి ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు.

also read:

Visitors Are Also Reading