మనం ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఉపయోగించే వాటి లో రైల్వేలు ముందు వరసలో ఉంటాయి. రైల్వే ల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాము. అలాగే సమయం ఆదా కూడా ఉంటుంది. అందుకే దూర ప్రయాణాలు చేసే సమయంలో రైల్వేలో నే ఎక్కువ గా వాడుతుంటారు.
Also Read: లిఫ్ట్‌లల్లో మిర్రర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?
Advertisement
అందువల్ల రైల్వే స్టేషన్లకు మనం రెగ్యూలర్ గా వెళ్తుంటం. అయితే ఎప్పుడు అయినా రైల్వే ప్లాట్ ఫామ్ ను గమనించారా. రైల్వే ప్లాట్ ఫాం పై పసుపు రంగు లో ఒక లైన్ ఉంటుంది. ప్లాట్ ఫాం ఎంత పోడువు ఉంటే అంత పోడువు ఆ పసుపు రంగు లైన్ ఉంటుంది. అయితే పసుపు రంగు గీ ఎందుకు పెడుతారో తెలుసా? అయితే ఇప్పుడు మనం ఆ పసుపు రంగు లైన్ గురించి తెలుసుకుందాం.
Advertisement
ఈ పసుపు రంగు లైన్ అనేది ప్లాట్ ఫాం పై రైల్వే ట్రాక్ కు దగ్గర గా ఉంటుంది. పసుపు రంగు గీత తర్వాత ఎర్రటి రంగులో ఉంటుంది. దాని తర్వాత రైల్వే ట్రాక్ ఉంటుంది. అయితే పట్టాలపైనుంచి రైలు వెళ్తున్న సమయం లో ఎక్కువ గా గాలి వీస్తుంది. అలాంటి సందర్భంలో ఆ ఎరుపు రంగు ఉన్న ప్రాంతంలో ఎవరైనా నిల్చుంటే.. ప్రమాదం. అయితే ఆ ఎరుపు రంగు పక్కన పసుపు రంగు గీతను దాటి ఎరుపు రంగు ప్రాంతంలో కి వెళ్లకూడదు అని తెలిపేందుకు ఆ పసుపు రంగు లైన్ ను వేస్తారు. ఆ పసుపు రంగు గీతను దాటి ఎవరూ కూడా వెళ్లవద్దని అల చెప్పడానికి వేస్తారు. ట్రైన్ ఆగిన తర్వాతే.. ఆ పసుపు రంగు గీతను దాటాలి. అందుకే ఆ పసుపు రంగు గీతను వేస్తారు.
Also Read: పెప్సీ కోకాకోలా ల ఈ లొల్లి గురించి మీకు తెలుసా? దీని నుండి మనమేం నేర్చుకోవాలి?