Telugu News » ఉగాది పండుగ రోజు ఏమి చేస్తారు..? పంచాంగ శ్ర‌వ‌ణం ఎందుకో తెలుసా..?

ఉగాది పండుగ రోజు ఏమి చేస్తారు..? పంచాంగ శ్ర‌వ‌ణం ఎందుకో తెలుసా..?

by Anji

ఉగాది పండుగ అన‌గా ప్ర‌పంచం జ‌న్మాయుష్సుల‌కు మొద‌టిరోజు అని అర్థం. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అన‌గా రెండు లేదా జంట అని అర్థం. భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం.. యుగ‌మున‌కు ఆది కాబ‌ట్టి ఉగాది అని స‌క‌ల రుతువుల‌కు చైత్రం ఆది గ‌నుక చైత్ర‌మాసంలో వ‌చ్చిన ఉగాది అని అంటాం. చైత్ర శుక్ల పాడ్య‌మి అన‌గా ఉగాది రోజు సృష్టి జ‌రిగిన‌ద‌ని పురాణ‌నైతికంగా చెప్ప‌బ‌డింది. మ‌న పురాణాల్లో వేదాల‌ను హ‌రించిన సోమ‌కుని వ‌ధించి మ‌త్స్యావ‌తార ధారి అయిన విష్ణువు వేదాల‌ను బ్ర‌హ్ము అప్ప‌గించిన రోజునే ఉగాదిగా ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్టు కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

Ads


చైత్ర శుక్ల‌పాడ్య‌మి రోజు బ్ర‌హ్మ‌దేవుడు సృష్టిని ప్రారంభించిన‌ట్టు పురాణాలు చెప్ప‌డంత ఇవాళ ఉగాదిని జ‌రుపుకుంటాం. అదేవిధంగా శాలివాహ‌న చ‌క్ర‌వ‌ర్తి చైత్ర పాడ్య‌మి నాడే ప‌ట్టాభిషిక్తుడై త‌న శౌర్య‌ప‌రాక్ర‌మాల‌తో శాలివాహ‌న యుగ‌క‌ర్త‌గా బాసిల్లిన కార‌ణంతో ఆయ‌న‌కు స్మృతిగా ఉగాది ఆచ‌రించ‌బ‌డ‌టం చారిత్ర‌క వృత్తాంతం.

చైత్ర శుక్ల‌పాడ్య‌మి రోజు బ్ర‌హ్మ‌దేవుడు సృష్టిని ప్రారంభించిన‌ట్టు పురాణాలు చెప్ప‌డంత ఇవాళ ఉగాదిని జ‌రుపుకుంటాం. అదేవిధంగా శాలివాహ‌న చ‌క్ర‌వ‌ర్తి చైత్ర పాడ్య‌మి నాడే ప‌ట్టాభిషిక్తుడై త‌న శౌర్య‌ప‌రాక్ర‌మాల‌తో శాలివాహ‌న యుగ‌క‌ర్త‌గా బాసిల్లిన కార‌ణంతో ఆయ‌న‌కు స్మృతిగా ఉగాది ఆచ‌రించ‌బ‌డ‌టం చారిత్ర‌క వృత్తాంతం.

ఉగాది రోజు ఏమి చేయాలి..?

  • ఉగాది రోజు ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం ధ‌ర్మంగా ఆచ‌రించాల్సిన కొన్ని నియ‌మాలు ఉన్నాయి. అవి ఏమిటంటే.?

 

  • తెల్ల‌వారు జామునే నిద్ర లేవ‌డం. ఇంటిని శుభ్ర‌ప‌రుచుకోవడం., మామిడి తోర‌ణాల‌తో అలంక‌రించ‌డం చేయాలి.

 

  • త‌ల‌స్నానం ఆచ‌రించాలి. కొత్త బ‌ట్ట‌లు ధ‌రించాలి. ఇంట్లో గానీ దేవాల‌యంలో గానీ భ‌గ‌వంత‌న్ని ఆరాదించాలి.

 

  • పెద్ద‌ల ఆశీర్వాదం తీసుకోవ‌డం నైవెద్యంగా పెట్టి ప్ర‌సాదంగా స్వీక‌రించ‌డం పంచాంగ శ్ర‌వ‌ణం చేయ‌డం వంటివి చేయాలి.

ఉగాది ప‌చ్చ‌డి ఎందుకు స్వీక‌రించాలి..?

ఉగాది ప్ర‌త్యేక‌త‌లో అత్యంత ముఖ్య‌మైన‌ది ఉగాది ప‌చ్చ‌డి ఇది ష‌డ్రుచులు అంటే రుచుల స‌మ్మెళనం. ఇది తెలుగు వారికి ఎంతో ప్ర‌త్యేక‌మైంది. ఇందులో చేదు కారం, తీపి, ఉప్పు, పులుపు, వ‌గ‌రు అనే ఆరు రుచుల‌తో చేసే ప‌చ్చ‌డిలో శాస్త్రీయ, ఆధ్యాత్మిక మేళ‌వించి ఉండ‌డం విశేషం. ఈ ష‌డ్రుచులు మ‌న జీవితంలో ఆరు రకాలైన ఎలాంటి రుచులు ఉన్నాయో వాటి ప్ర‌తిరూపంగా, మాన‌వుని జీవితంలో క‌ష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ ఇలాంటివి అన్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని అన్నింటినీ స‌మానంగా స్వీక‌రించి జీవితంల ముందుకు సాగాల‌ని చెప్పే ఆధ్యాత్మిక భావ‌న ఉగాది ప‌చ్చ‌డిలోని అర్థం. ముఖ్యంగా ఉగాది ప‌చ్చ‌డి చైత్ర‌మాసంలో తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో ఉన్న క్రిములు చెడు బాక్టిరియా నశిస్తాయ‌ని ఆరోగ్య‌ప‌రంగా శ‌రీరానికి మంచి చేస్తుంద‌ని సైన్స్ తెలియజేస్తుంది.

పంచాంగ శ్ర‌వ‌ణం ఎందుకంటే..?

ఆధునిక స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎవ‌రి ప‌నుల గురించి వారే ఎక్కువ‌గా ఆలోచించే ప‌రిస్థితి. మ‌న పూర్వీకులు ఏ ప‌ని చేసినా స‌మాజం కోసం స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని చేశార‌న‌డానికి ఈ ఉగాది ప‌ర్వ‌దిన‌మే స‌రైన ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. పంచాంగ శ్ర‌వ‌ణం చేయ‌డం వ‌ల్ల దేశ కాల‌మాన ప‌రిస్థితులు తెలుస్తాయి. అలాగే ప్ర‌తి ఒక్క‌రికీ రాబోయే ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న వ‌స్తుంది. మంచి జ‌రిగిన వారు భ‌గ‌వంతుడు దానిని త‌న‌కు ఇచ్చిన ఓ మంచి అవ‌కాశంగా భావించ‌డం చెడుగా ఉన్న‌ట్ట‌యితే గ్ర‌హ‌స్థితి ఉన్నందున రాబోయే కాలంలో మంచి జ‌రుగుతుంద‌నే ఆశ‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌డం చేస్తుంటారు. సానుకూల దృక్ప‌థంతో ఆలోచ‌న ధోర‌ణీ విలువ‌ల‌ను పంచాంగ శ్ర‌వ‌ణం ద్వారా పెద్ద‌లు అంద‌జేశారు. జ్యోతిష్యాన్ని సానుకూల దృక్ప‌థంగానే చూడాలి త‌ప్ప వ్యాపార ధోర‌ణి ప్ర‌తికూల ధోర‌ణిలో చూడ‌కూడ‌దు. పంచాంగ శ్ర‌వ‌ణంలో ఏవైనా క‌ష్టాలు ఉన్నాయ‌ని తెలిసిన‌ప్పుడే దానిని ఎలా త‌ట్టుకుని ముందుకెళ్లాలో ప్రోత్స‌హించేదే పంచాంగ శ్ర‌వ‌ణం.

Also Read :  శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసా..?


You may also like