Home » యాపిల్ కంపెనీ లోగో సగం కొరికినట్టు ఎందుకు ఉంటుందో తెలుసా?

యాపిల్ కంపెనీ లోగో సగం కొరికినట్టు ఎందుకు ఉంటుందో తెలుసా?

by aravind poju
Ad

ప్రపంచంలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఏ కంపెనీకి అయిన తమ కంపెనీకంటూ ఒక బ్రాండ్ ను, తమ ప్రత్యేకతను స్పష్టం చేసేలా ఒక లోగోను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఏదైనా ఒక కంపెనీ సాధారణ కంపెనీగా ఉన్నప్పుడు పెద్దగా కంపెనీ లోగోపై ఎటువంటి చర్చ జరగదు. అయితే అదే కంపెనీ ఒక భారీ కంపెనీగా ఎదిగితే మాత్రం ముఖ్యంగా అందరి దృష్టి సదరు కంపెనీలోగో పైనే ఉంటుంది. అలా అందరి దృష్టి పడాలనే ఉద్దేశ్యంతోనే  కంపెనీలు తమ లోగోలను వినూత్నంగా ఉండేలా చూసుకుంటాయి. అయితే ప్రస్తుతం చాలా వరకు లోగో లపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన కంపెనీలలో యాపిల్ ఒకటి. యాపిల్ కంపెనీ లోగోపై ప్రధానంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం యాపిల్ సగం కొరికినట్టు ఉండటమే.

                                                                             

Advertisement

Advertisement

అయితే యాపిల్ కంపెనీ కాబట్టి ఉంటే మొత్తం యాపిల్ ఆకారంలో లోగో ఉండాలి, కానీ ఇలా సగం కొరికినట్టు ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం యాపిల్ కంపెనీ లోగోలో యాపిల్ సగం కొరికినట్టు ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే మొదట్లో యాపిల్ కంపెనీలోగో  న్యూటన్  యాపిల్ చెట్టు క్రింద కూర్చొని ఉన్నట్టు లోగో ఉండేది. అయితే ఆ లోగో స్టీవ్ జాబ్స్ కి నచ్చకపోవడంతో రాబ్ జానఫ్ అనే వ్యక్తి చేత ఈ లోగో చేయించాడు. అయితే ఈ లోగో సీవ్ జాబ్స్ కు విపరీతంగా నచ్చడంతో ఇక దీనినే యాపిల్ లోగోగా నిర్ణయించాడు. అయితే ఎందుకు యాపిల్ లోగో ఇలా యాపిల్ సగం కొరికినట్టు ఉంటుందనే దానిపై రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

 

బైబిల్ యాడం మరియు ఈవ్ లను దేవుడు ఏ పండు అయితే తినవద్దని చెబుతాడో అదే పండును తినడంతో ప్రపంచం మొత్తం మారిపోయిందని అందుకే వారికి గుర్తుగా ఇలా సగం కొరికిన యాపిల్ ను లోగో గా ఏర్పాటు చేశారని ఒక ప్రచారం ఉంది. ఒక ఇంటర్వ్యూలో  రాబ్ జానఫ్ లోగోపై వివరణ ఇచ్చారు. యాపిల్ అనేది చెర్రీ ఆకారాన్ని కూడా పోలి ఉంటుందని దీంతో చెర్రీ, ఆపిల్ ను గుర్తించడం కష్టమని అందుకే సగం కొరికినట్టు ఉండడం వల్ల సులభంగా గుర్తించే అవకాశం  ఉంటుందనే ఉద్దేశ్యంతో మాత్రమే ఇలాంటి లోగోను ఏర్పాటు చేశామని తెలిపారు.

Visitors Are Also Reading