అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పిన తక్కువే. ముఖ్యంగా శ్రీదేవి చిన్న వయస్సులోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మారింది. తన కంటే సీనియర్స్ తో, జూనియర్స్ తో ఇద్దరితో నటించిన అనుభవం శ్రీదేవికి ఉంది. తెలుగులో తొలుత సీనియర్ ఎన్టీఆర్ తో బడిపంతులు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఇక ఆ తరువాత ఆమె హీరోయిన్ గా సినిమాల్లో నటించడం ప్రారంభించింది. బొబ్బిలి పులి సినిమాకి వచ్చే సరికి ఏకంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఎన్టీఆర్ తో అంతకు ముందు కూతురుగా నటించిన అమ్మాయితో కలిసి హీరోగా నటించడానికి అన్నగారు కాస్త ఇబ్బంది పడ్డాడట. మరోవైపు శ్రీదేవి కూడా తండ్రిగా నటించిన ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్ గా నటించేందుకు చాలా ఇబ్బంది పడిందట. ప్రధానంగా శ్రీదేవిని ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే బలవంతం మాత్రం ఎవ్వరూ చేయలేదట. కానీ వీరిద్దరి మధ్య వయస్సు భేదం ఎక్కువగా ఉండడం వల్లనే ఈ ఫీలింగ్ వచ్చిందట. ఇక చిత్రంలో శ్రీదేవి ఎన్టీఆర్ సరసన నటించడానికి దర్శకుడు దాసరి నారాయణరావు ప్రధాన కారణం అనే చెప్పవచ్చు. హీరోయిన్ గా శ్రీదేవి నటించేందుకు ఒప్పించింది కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు కావడం విశేషం. మొదట్లో శ్రీదేవి కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. అంతా తాను చూసుకుంటానని చెప్పి దాసరి ఒప్పించారట.
Advertisement
Also Read : “వాల్తేరు వీరయ్య”లో ఆ స్టార్ విలన్ కి ఇంతటీ అవమానం జరిగిందా..?
‘బడిపంతులు’ సినిమా సమయంలో ఎన్టీఆర్ ని అంకుల్ అని పిలిచే అలవాటు ఉన్న శ్రీదేవి హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా అలాగే పిలిచేదట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా కాస్త సరదాగానే తీసుకున్నారట. ఇక బొబ్బిలి పులి సినిమా సమయంలో శ్రీదేవి వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అప్పటికీ ఎన్టీఆర్ వయస్సు 50కి పైగా ఉండేది. ఆకారంలో కూడా ఆయన కొంచెం పెద్దగానే కనిపించేవారు. ఇక అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావుతో కూడా శ్రీదేవి నటించడం ప్రారంభించింది. అక్కినేనిని మాత్రం ఆమె సార్ అని సంబోధించేదట. అందుకు ప్రధాన కారణం అక్కినేని ఎప్పుడూ డైట్ చేస్తూ చూడడానికి చాలా చిన్న కనిపించేవారట. శ్రీదేవితో అక్కినేని అంతా చనువుగా కూడా ఉండేవాడు కాదట. అందుకే ఆమె అక్కినేని నాగేశ్వరరావుతో కాస్త దూరం అన్నట్టు ఉంటూ ఉండేదట.
Also Read : ఫారెన్ సీన్ లో బాలయ్యని కత్తులతో పొడుస్తుంటే పోలీసులు వచ్చి ఏం చేశారో తెలుసా ?