Home » చిన్న పిల్ల‌ల‌కు త‌ల వెంట్రుక‌లు ఎందుకు తీస్తారో మీకు తెలుసా..?

చిన్న పిల్ల‌ల‌కు త‌ల వెంట్రుక‌లు ఎందుకు తీస్తారో మీకు తెలుసా..?

by Anji
Ad

భార‌త‌దేశంలో భిన్న‌త్వంలో ఏక‌త్వం ఉంటుంది.  ఎన్నో మ‌తాలు, ఎన్నో ఆచార వ్య‌వ‌హారాలు, ఎన్నో సంప్ర‌దాయాలుంటాయి. ప్ర‌ధానంగా హిందూ సంప్ర‌దాయంలో మ‌నిషి పుట్టిన‌ప్ప‌టి నుంచి మ‌ర‌ణించే వ‌ర‌కు ఎన్నో ర‌కాలుగా వెంట్రుక‌లు తీస్తుంటారు. ఇంట్లో పుట్టిన బిడ్డ‌కు కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత గుండు కొట్టిస్తారు. పిల్ల‌లు పుట్టిన త‌రువాత 9 లేదా 11 నెల‌ల‌కు ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలకు గుండు చేయిస్తుంటారు. ఇలా గుండి కొట్టించ‌డాన్ని పుట్టు వెంట్రుక‌లు అంటారు. ఈ కార్య‌క్ర‌మాన్నిఆ చిన్నారి మేన‌మామ తొలుత కొన్ని వెంట్రుక‌ల‌ను క‌త్తిరిస్తాడు.


ఆ త‌రువాత వారికి పూర్తిగా గుండు కొట్టిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధానంగా తిరుప‌తి, శ్రీ‌శైలం, యాదాద్రి, వేముల‌వాడ, మ‌ద్దిమ‌డుగు, కాళేశ్వ‌రం ఇలా ప‌లు పుణ్య‌క్షేత్రాల్లో పుట్టు వెంట్రుక‌లు తీసే కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయి. పుణ్య‌క్షేత్రాల్లో చిన్న పిల్ల‌ల‌కు త‌ల‌వెంట్రుక‌లు ఎందుకు తీస్తారో అస‌లు చాలా మందికి తెలియ‌దు. చాలా వ‌ర‌కు త‌మ కుటుంబంలో సంప్ర‌దాయంగా వ‌స్తుంద‌ని ఈ ఆచారాన్ని పాటిస్తారు. దేవుడి ఆశీర్వాదం పిల్ల‌ల మీద ఉంటుంద‌ని న‌మ్ముతుంటారు. కానీ పుట్టు వెంట్రుక‌లు తీయ‌డంవెనుక కూడా సైన్స్ దాగి ఉంద‌నే విష‌యం చాలా మందికి తెలుసు. త‌ల్లి తొమ్మిది నెల‌ల గ‌ర్భంలో ఉండి లోకానికి వచ్చిన త‌రువాత వారి త‌ల‌మీద సూక్ష్మ‌క్రిములుంటాయి. త‌ల వెంట్రుక‌లను ఎంత శుభ్రం చేసినా కానీ ఆ క్రిములను మాత్రం అంత త్వ‌ర‌గా తొల‌గించ‌లేము.

Advertisement

Advertisement

ముఖ్యంగా షాంపుతో స్నానం చేయించినా ఆ క్రిములుమాత్రం పోవు. అందుకే త‌ల మీద వెంట్రుక‌ల‌ను క‌ట్ చేస్తుంటారు. ఇలా చేయ‌డంతో ఆ క్రిములు పూర్తిగా వెళ్లిపోతాయి. పిల్ల‌ల‌కు శిరోముండ‌నంచేస్తే వారి శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గుండు చేయించ‌డం ద్వారా కురుపులు, మొటిమ‌లు, విరేచ‌నాలు వంటి వ్యాధులు పూర్తిగా పిల్ల‌ల నుంచి తొల‌గిపోతాయి. ఎక్కువ‌గా హిందూ కుటుంబాల్లో చిన్నారుల‌కు గుండు చేయిస్తుంటారు. త‌ల‌మీద వెంట్రుక‌లు లేక‌పోతే సూర్య‌ర‌శ్మి త‌ల‌మీద పిల్ల‌ల‌కు నేరుగా త‌గిలి మెద‌డు అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది. సిరుల్లో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతుంది. పిల్ల‌ల‌కు గుండ్లు చేస్తే దంతాలు చాలా సుల‌భంగా వ‌స్తాయ‌ట‌. సైన్స్ ప్ర‌కారం.. ఇది వాస్త‌వం అని డాక్ట‌ర్లు పేర్కొంటున్నారు. దీంతో చిన్నారుల‌కు గుండు చేయించ‌డం మూఢ‌న‌మ్మ‌కంకాద‌ని సైన్స్ అని ప‌లువురు పండితులు చెబుతున్నారు.

Also Read : 

డైరెక్ట‌ర్ ప‌ద‌వీకి ముఖేష్ అంబానీ రాజీనామా.. నూత‌న చైర్మ‌న్‌గా ఆకాశ్ అంబానీ..!

 

Visitors Are Also Reading