Home » శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగితే రాజశేఖ‌ర్ ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా..?

శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగితే రాజశేఖ‌ర్ ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా..?

by AJAY
Ad

కొంత‌మంది సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌స్తుంటారు. కానీ కొంత‌మంది యాధృచ్చికంగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ లు మారిపోతారు. ఆ లిస్ట్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ కూడా ఒక‌రు. నిజానికి రాజ‌శేఖ‌ర్ హీరో అవ్వాల‌ని ఎప్పుడూ అనుకోలేద‌ట‌. ఎంబీబీ ఎస్ చ‌దువుతున్న స‌మ‌యంలో ఆయ‌న అందం చూసి ఫ్రెండ్స్ అంతా సినిమాల్లోకి వెళ్ల‌మ‌ని చెప్పేవార‌ట‌.

Advertisement

అంతే కాకుండా ఎంబీబీ ఎస్ పూర్తి చేసిన త‌వార‌త రాజ‌శేఖ‌ర్ డాక్టర్ గా ఉన్నప్పుడు వ‌చ్చిన అమ్మాయిలు కూడా అత‌డి అందం చూసి ఫిదా అయ్యేవార‌ట‌. ఇక అనుకోకుండా ఓ సినిమాలో ఆఫ‌ర్ రావ‌డంతో రాజ‌శేఖ‌ర్ సినిమాల్లోకి వ‌చ్చారు. వ‌రుస సినిమాలు స‌క్సెస్ అవ్వ‌డంతో స్టార్ హీరో అయ్యారు. రాజ‌శేఖ‌ర్ స్టార్ హీరో ఏంటి అని కొంత‌మంది అనుకోవ‌చ్చు. కానీ ఒక‌ప్పుడు రాజ‌శేఖ‌ర్ స్టార్ హీరోగానే కొన‌సాగారు.

Advertisement

rajashekar

rajashekar

ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక జీవిత రాజశేఖ‌ర్ కాంబోకి అప్ప‌ట్లో క్రేజ్ ఉండేది. చివరికి వీరిద్దరూ ఒక‌రినొక‌రు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు జీవిత అంటే రాజ‌శేఖ‌ర్…రాజ‌శేఖర్ అంటే జీవిత అన్నమాదిరిగా క‌లిసి మెలిసి ఉంటారు. జీవిత తోడు లేకుండా రాజ‌శేఖ‌ర్ ఏ సినిమా ఫంక్ష‌న్ లేదా పొలిక‌ల్ ఈవెంట్స్ లోనూ క‌నిపించ‌రు.

అయితే నిజానికి రాజ‌శేఖ‌ర్ కు అప్ప‌టి టాప్ హీరోయిన్ శ్రీదేవి ని చేసుకోవాలంటూ పెళ్లి సంబంధం వ‌చ్చింది. ఈ విషయం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఈ విష‌యాన్ని రాజ‌శేఖ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. శ్రీదేవి త‌ల్లి హీరోగా బిజీగా ఉన్న రాజ‌శేఖ‌ర్ ను త‌న కూతురుని వివాహం చేసుకోవాల‌ని అడిగార‌ట‌. కానీ రాజ‌శేఖ‌ర్ అప్పుడప్పుడే సినిమాల్లో ఎదుగుతూ ఉండ‌టం వ‌ల్ల ఇప్పుడే పెళ్లి చేసుకోవ‌ద్దు అనే నిర్న‌యం తీసుకున్నార‌ట‌. అలా శ్రీదేవిని వివాహం చేసుకునే ఛాన్స్ వ‌చ్చినా రాజ‌శేఖ‌ర్ మిస్ చేసుకున్నారు.

Visitors Are Also Reading