Home » శ్రీరామనవమి రోజున మధ్యాహ్న సమయంలోనే పూజ ఎందుకు చేయాలో తెలుసా..?

శ్రీరామనవమి రోజున మధ్యాహ్న సమయంలోనే పూజ ఎందుకు చేయాలో తెలుసా..?

by Sravanthi
Ad

హిందూ పండగలలో శ్రీరామనవమి కూడా ఒకటి.. ఈ పండగ రోజున భక్తులు చాలా నిష్టతో శ్రీరామున్ని సీతను పూజిస్తారు.. సకల భాగ్యాలు కలగాలని కోరుకుంటారు. మరి శ్రీరామనవమి రోజు శ్రీరామున్ని ఏ సమయంలో పూజించాలి.. ఎలా పూజించాలి..అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీరాముడు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిషేక్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించారని పురాణ కథలు చెబుతున్నాయి.

Advertisement

Also Read:“ఆస్కార్” స్టేజ్ పై స్టెప్పులు వేయాల‌ని చ‌ర‌ణ్ అనుకుంటే ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పారు..! లీక్ అయిన అస‌లు మ్యాట‌ర్..!

Advertisement

మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజును హిందువులు శ్రీ రామ నవమి పండగగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం 14 సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి రోజే వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున ప్రతి రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.

Also Read:నైట్ పార్టీల‌కు విరాట్ అనుష్క‌లు ఎందుకు దూరంగా ఉంటారో తెలుసా..?

ఆ తర్వాత వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు చేస్తే మేలు జరుగుతుందని, కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఉత్తర భారత దేశంలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరి ఎందుకు ఆలస్యం శ్రీరామనవమి రోజు మీరు కూడా మధ్యాహ్న సమయంలో పూజలు చేసి ఆ రాముని అనుగ్రహం పొందండి.

Also Read:ఆస్కార్ కు పంపాల‌నుకున్న ఈ ఇండియ‌న్ సినిమా స్టోరీ తెలిస్తే మ‌తిపోవాల్సిందే..ఆ ఒక్క సీన్ చూస్తే చాలు!

Visitors Are Also Reading