ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది సర్వ సాధారణం. ప్రతి వ్యక్తి దగ్గర తప్పని సరిగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు తక్కవ ధరకే లభించడం తో పాటు స్మార్ట్ ఫోన్ అవసరాలు పెరగడం తో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. రోజులు మారుతున్న కొద్ది కొత్త బ్రాండ్ల ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. అలాగే అడ్వాన్స్ ఫీచర్స్ తో ఆకర్షిస్తున్నాయి. అయితే గతంలో స్మార్ట్ ఫోన్ల ను ఛార్జ్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 గంటలు టైమ్ పట్టేది. అయితే కాలం మారుతున్న కొద్ది 30 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. అలాగే ఎక్కువ సమయం ఛార్జ్ ఆగుతుంది. అయితే స్మార్ట్ ఫోన్లలో చాలా మారిన ఛార్జింగ్ కేబుల్స్ సైజ్ మాత్రం మారడం లేదు. ప్రతి స్మార్ట్ ఫోన్ కు చిన్న ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. అయితే ఫోన్ ఛార్జింగ్ కేబుల్స్ ఎందుకు చిన్న ఉంటాయో తెలుసుకుందాం.
Advertisement
Advertisement
1) ఛార్జర్ కేబుల్ ఎక్కువ పెద్దది గా ఉంటే ఛార్జింగ్ స్లోగా అవుతుంది. కేబుల్ పెద్దగా కరెంటును పాస్ చేయడానికి ఎక్కువ రెసిస్టన్స్ అవసరమవుతుంది. దీంతో కేబుల గుండా విద్యుత్ చలనం స్లో గా ఉంటుంది. దీని వల్ల ఫోన్ పూర్తి గా ఛార్జింగ్ అవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
2) ఫోన్ ఛార్జ్ చేస్తున్న సమయం లో ఎస్ఏఆర్ రేడియేషన్ ఎనర్జీ విడుదల అవుతుంది. అయితే ఆ రేడియేషన్ నుంచి వచ్చే క్రమం లో మనం దగ్గర ఉండటం ప్రమాదం. అయితే పెద్దగా కేబుల్ ఉంటే మనం ఎప్పుడూ ఛార్జ్ చేసిన వాటి దగ్గర ఉంటం. అందుకే కేబుల్ ను చిన్నగా ఇస్తారు.
3) కేబుల్ ను చిన్నగా ఇవ్వడంలో ఒక వ్యాపార సూత్రం కూడా దాగి ఉంది. ఫోన్ తో చిన్న కేబుల్స్ ఇస్తే.. మనం పెద్ద కేబుల్స్ కోసం మళ్లి కొనుగోళ్లు చేస్తాం అప్పుడు వారికి మార్కెటింగ్ పెరుగుతుంది.
4) ప్రస్తుతం వస్తున్న USB పోర్ట్ తో ఉన్న కేబుల్స్ ను CPU కు కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే CPUలకు కనెక్ట్ చేసి వాడుకోవడానికి చిన్న కేబుల్ సరిపోతుంది.