Telugu News » Blog » బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదో తెలుసా..?

బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. అయితే బాలకృష్ణ పెళ్లి వసుంధర దేవితో చాలా యాదృచ్ఛికంగా జరిగిందట. కళ్యాణం వచ్చిన కక్కచ్చిన ఆగదంటారు కదా.. ఆ విధంగానే బాలయ్య పెళ్లి కూడా జరిగిందట.. ఈ పెళ్లికి ఎన్టీఆర్ కూడా రాలేదట.. మరి కారణం ఏంటో చూద్దాం.. నటనకు కాస్త విరామం ఇచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్.

Advertisement

Bala krishna Marriage

ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత చాలా బిజీ అయిపోయారు. ఈయన పార్టీ స్థాపించిన దానికి ముందే రామోజీరావు ఈనాడు పేపర్ కి అధినేతగా ఉన్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ తన రాజకీయం గురించి ప్రతి విషయాన్ని జర్నలిస్టులతో చర్చిస్తూ ఉండేవారు.

also read:ఎన్టీఆర్ తో భారీ మూవీ నిర్మించబోతున్న బాలీవుడ్ నిర్మాత ఎవరో తెలుసా ?

Advertisement

అలానే ఓ రోజున రామోజీరావు ఇంటికి వెళ్లారు ఎన్టీ రామారావు. పార్టీ ప్రజలు సమస్యల గురించి ఆయనతో చర్చిస్తున్న సందర్భంలో ఓ అమ్మాయి టీ పట్టుకుని వచ్చింది. ఆ టీ తీసుకున్న రామారావు ఆ అమ్మాయి ఎవరు అని రామోజీరావును అడిగారట. దీంతో రామోజీరావు నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురు అని చెప్పారట. ఆ టీ ఇచ్చింది ఎవరో కాదు వసుంధర దేవి. ఈమె అంటే రామోజీరావు ఆయన సతీమణికి చాలా ఇష్టమట. అందుకే తరచూ వీరి ఇంట్లోనే ఆమె ఉండేదట. మొదటినుంచి సూర్యారావు రామోజీరావు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారట.

also read:కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..

అప్పటికే సూర్యారావు ఎస్ఆర్ఎంటి అధినేత మరియు వివిధ బిజినెస్ లతో చాలా ధనిక వ్యక్తట. ఈ క్రమంలోనే రామోజీరావు మరియు ఎన్టీఆర్ బాలకృష్ణ వివాహం గురించి కూడా చర్చించి ఆ అమ్మాయి బాలకృష్ణ కైతే ఎలా ఉంటుందని అడిగారట. దీంతో రామోజీరావు కూడా చాలా బాగుంటుందని ఆనందపడ్డారట. ఇంకేముంది వారం రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి కూడా పెట్టేసుకున్నారు.. కానీ పెళ్లికి మాత్రం ఎన్టీఆర్,హరికృష్ణ హాజరు కాలేదట.. అంతా రామోజీరావు దగ్గరుండి చూసుకున్నారట.. వారు బాలకృష్ణ పెళ్ళికి హాజరు కాకపోవడానికి కారణం ఎన్టీఆర్, హరికృష్ణ అర్జెంట్ మీటింగులో ఉండడమేనట.

Advertisement

also read:మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్… వీడియో వైరల్

You may also like