Home » రోహిణి కార్తేకు రోళ్లు పగులుతాయని ఎందుకు అంటారో తెలుసా ?

రోహిణి కార్తేకు రోళ్లు పగులుతాయని ఎందుకు అంటారో తెలుసా ?

by Anji
Ad

రోహిణి కార్తే ఈరోజు నుంచి  ప్రారంభం అవుతుంది. అనగా ఎండలు ఇంకా పెరుగుతాయని పెద్ద వారు చెబుతూ ఉంటారు. రోహిణి కార్తెలో ఎండలకు రోల్లు పగులుతాయని పూర్వం ప్రజలు చెబుతూ ఉండేవారు. నిజమే మరి నాలుగు నెలలు ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దికొద్దిగా పెరిగి, ఉగాది నుంచి వేడి తాపం పెరుగుతుంది. ఎండాకాలం చివరి దశలో రోళ్లు పగిలేలా ఎండలు ఉంటాయని పూర్వం ప్రజలు చెప్పేవారు. మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తే అయిన రోహిణిలో ఎండలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. మరి ఈ ఏడాది రోహిణి కార్తె ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న మొదలై జూన్ 8 వరకు ఉంటుంది. రోహిణి కార్తె ఫలితం ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం త్వరగా అలిసిపోతుంది. కాబట్టి ఈ ఆరోగ్య రీత్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మట్టి కుండ నీరు త్రాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావా లాంటివి త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Advertisement

మసాలాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే చాలా మంచిది. నీరు సౌకర్యంగా ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయాలి. అన్ని రకాల వయసు వారు ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించటమే ఉత్తమం. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడిగుడ్డతో తుడిచి బట్టలు మార్చాలి. అలాగే ఈ భూమిపై ఉన్న నోరులేని జీవులకు చల్లని ప్రదేశంలో త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో నడిచి వెళ్లే ప్రజలకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం వల్ల మీకున్న గ్రహ దోషాలు కూడా దూరం అయిపోతాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 చిరంజీవితో తలపడనున్న బోయపాటి… అదే జరుగుతే ఈసారి మామూలుగా ఉండదు..!

“విరూపాక్ష” సినిమాలో “హీరోయిన్ తల్లి”గా నటించిన నటి ఎవరో తెలుసా…?

Visitors Are Also Reading