Home » అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? 

by Anji
Ad

ప్రతీ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటాయి. మార్చి 08న మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు మహిళల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ విజయాలను గుర్తు చేసుకుంటాం. ముఖ్యంగా నిత్య జీవితంలో మహిళలు నిత్యం ఎదుర్కునే సమస్యలను ఎత్తి చూపేందుకు మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి ఓ అవకాశమే  మహిళా దినోత్సవం. ఆడ, మగ అందరూ ఒక్కటే అనే అంశాన్ని ప్రతి ఏడాది మార్చి 08న గుర్తు చేసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  మళ్ళీ ప్రభాస్ కు అనారోగ్యం..?

Advertisement

మహిళా దినోత్సవం 1909 నుంచి జరుపుకోవడం ప్రారంభమైంది. న్యూయార్క్ లో వస్త్ర కార్మికుల సమ్మెను పురస్కరించుకొని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈరోజును ఉమెన్స్ డే గా ప్రకటించింది. అమెరికా ప్రకటన చేసినప్పటికీ ఎలాంటి వేడుకలు జరుగలేదు. మొదటగా మహిాళా దినోత్సవ వేడుకలు  1911లో జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా యూరోపియా దేశాల మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష మందికి పైగా మహిళలు ఓటు హక్కును కోరుతూ.. ప్రభుత్వ ఆఫీస్ లను నిర్వహించే హక్కులను కోరుతూ.. రోడ్డుపై పోరాటం చేసారు. లింగ వివక్ష తొలగిపోవాలని, సమానమైన వేతనం ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు.  

Advertisement

Also Read :   బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం పక్కా..!

Manam News

మార్చి 08, 1917లో ఐరోపాలో మరో సంఘటన జరిగింది. సెయింట్ పీటర్ బర్గ్ లోని మహిళా వస్త్ర కార్మికులు రోడ్డుపైకి వచ్చి మహిళా హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ తరువాత ఈ పోరాటం రష్యన్ విప్లవంగా అవతరించింది. దీంతో ఐక్యరాజ్యసమితి మార్చి 08న మహిళల ప్రత్యేకమైన రోజుగా ప్రకటించింది. ఇక ఆ రోజు నుంచి మార్చి 08న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. మగవారికి పోటీగా ఎందులోనైనా తాము విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు. మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. 

Also Read :  మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మీ పుట్టిందంటున్న టీమిండియా క్రికెటర్..

Visitors Are Also Reading