Home » మృగ‌శిర‌కార్తె రోజు చేప‌ల‌ను ఎక్కువ‌గా ఎందుకు తింటారో మీకు తెలుసా..?

మృగ‌శిర‌కార్తె రోజు చేప‌ల‌ను ఎక్కువ‌గా ఎందుకు తింటారో మీకు తెలుసా..?

by Anji
Ad

మృగ‌శిర కార్తె గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మృగ‌శిర‌కార్తె రోజు ఏదైనా మృగాన్ని మింగాల‌ని మ‌న పెద్ద‌లు పేర్కొంటారు. ముఖ్యంగా ఎక్కువ‌గా చాలా మంది చేప‌ల‌ను తింటారు. అప్ప‌టి వ‌ర‌కు భ‌ర‌ణి కార్తెలో బండలు ప‌గిలే ఎండ‌లు, రోహిణి కార్తెలో రోళ్లు ప‌గిలే ఎండ‌ల‌తో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. మృగ‌శిర‌కార్తె వ‌చ్చిందంటే తొలిజ‌ల్లు కురిసేందుకు సిద్ధం అన్న‌ట్టు. గ్రీష్మ‌తాపంతో ఇన్నాళ్లు ఎండ‌ల‌కు అల్లాడిన జ‌నం ఇప్పుడు చిరుజ‌ల్లుల హాయిలో సాంత్వన పొందేందుకు సిద్ధం ఉంటారు. ఎండాకాలం నుంచి వానాకాలం షురువు కావ‌డంతో శ‌రీరంలో ఉష్ణోగ్ర‌తలు త‌గ్గిపోతాయి. రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గి ప్ర‌జ‌లు అనారోగ్యం బారిన ప‌డుతుంటారు. ఈ సీజ‌న్‌లో జీర్ణ‌శ‌క్తి కూడా చాలా త‌గ్గిపోతుంటుంది. శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌ల‌ను స‌మ‌తుల్యం చేసే ఇమ్యూనిటినీ పెంచేందుకు చేప‌లు దోహ‌ద‌ప‌డుతాయి. మృగ‌శిర కార్తె ప్రారంభం అవ్వ‌గానే చేప‌లు తింటారు. చేప‌లు తిన‌ని వారు ఇంగువ‌లో బెల్లం క‌లుపుకుని తింటారు.

Advertisement

చేప‌ల్లో ముఖ్యంగా కాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ఐర‌న్‌, కాప‌ర్‌, మెగ్నీషియం, జింక్ వంటి ఖ‌నిజ పోష‌కాలు ల‌భిస్తాయి. మాన‌వునికి కావాల్సిన అతిముఖ్య‌మైన రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్‌, ఐసాల్యూసిన్ వంటి ఎమైనో ఆమ్లాలు పుష్క‌లంగా ఇందులో ల‌భిస్తాయి. థ‌యామిన్‌, రైబోప్ల‌విన్‌, నియాసిన్‌, పెరిడాక్సిన్‌, బ‌యోటిన్‌, పెంటోదినిక్ ఆమ్లం, బీ 12 వంటి విట‌మిన్స్ పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఓమెగా 3 కొవ్వు ఆమ్లాల్లో డీహెచ్ఏ, ఈపీఏ వంటివి కంటి చూపున‌కు ప‌ని చేస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. చేప‌ల్లో ఉన్న కొవ్వులు శ‌రీర ర‌క్త‌పీడ‌నంపై మంచి ప్ర‌భావం చూపుతాయి. గుండెజ‌బ్బు, ఆస్త‌మా, వ్యాధిగ్ర‌స్తులు, గ‌ర్బిణిలు ఈ స‌మ‌యంలో చేప‌లు తింటే చాలా మంచిద‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

Advertisement


ఇవాళ మృగ‌శిర‌కార్తె షురూ కావ‌డంతో రాష్ట్రంలోని చేప‌ల మార్కెట్ల‌న్ని కిట‌కిట‌లాడుతున్నాయి. ఈరోజు చేప‌లు తిన‌డం ఆన‌వాయితిగా వ‌స్తుండ‌డంతో ప్ర‌జ‌లంద‌రూ చేప‌లు కొన‌డానికి మార్కెట్ల బాట ప‌ట్టారు. రెండింత‌లు ధ‌ర ఉన్నా.. చేప‌లు కొన‌కుండా ఎవ్వ‌రూ వెనుతిర‌గ‌డం లేదు. ఇవాళ చేప‌టు తింటే ఆరోగ్యం బాగుంటుంద‌నే న‌మ్మ‌కం వారిని ఇక మార్కెట్ల‌లో బారులు తీరేవిదంగా చేస్తుంది. హైద‌రాబాద్‌లోని చేప‌ల మార్కెట్‌ల‌న్ని వినియోగ‌దారుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ముషీరాబాద్ మార్కెట్‌లో తెల్ల‌వారుజాము నుంచే ప్ర‌జ‌లు చేప‌ల కొనుగోలుకు క్యూ క‌ట్టారు. సాధార‌ణ రోజుల కంటే చేప‌ల ధ‌ర‌లు విప‌రీతంగా ఉన్నాయ‌ని వినియోగ‌దారులు పేర్కొంటున్నారు. సాధార‌ణ రోజుల్లో కిలో మూడు వంద‌ల రూపాయ‌ల నుంచి నాలుగు వంద‌ల లోపు ఉండే కొర్ర‌మీను మృగ‌శిర రోజు ఏకంగా కేజీ 500 నుంచి రూ.600 వ‌ర‌కు అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని వ్యాపారులు తెలిపారు. మృగ‌శిర కార్తె రోజు తెలంగాణ‌లో ఎక్కువ‌గా కొర్ర‌మీను చేప‌ల‌ను తిన‌డం ఆన‌వాయితీ. అందుకే చేప‌ల‌కు డిమాండ్ బాగా పెరిగింది.

Also Read : 

ఒకప్పటి అందాల రాశి దివ్యభారతి చనిపోయిన రోజు అర్థరాత్రి ఏం జరిగిందో తెలుసా …!

సీనియర్ ఎన్టీఆర్ ను అభినందిస్తూ దినపత్రికలో కృష్ణ ఇచ్చిన ప్రకటన ఏంటో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading