Home » ఆవు పాల కంటే గేదె పాలు తెల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా ?

ఆవు పాల కంటే గేదె పాలు తెల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా పాలు తెలుపు వర్ణంలో ఉంటాయి. కానీ ఆవు పాటు మాత్రం కాస్త లేత పసుపు రంగులో ఉంటాయి. లేత పసుపు రంగులో ఎందుకు ఉంటాయనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉంటే.. కొన్ని జంతవుల పాలు తెల్లగా ఉండకపోవడానికి ప్రత్యేక కారణమే ఉంటుంది. ఆవు పాలలో బీటా కెరోటిన్ అనే పదార్థం కాస్త ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. అదే గేదే పాలలో ఆ పదార్థం లేకపోవడంతో పాలు తెల్లగా కనిపిస్తాయి. 

Advertisement

సాధారణంగా చిన్నపిల్లలకు గేదె పాలకంటే ఆవు పాలు చాలా మంచివట. వాటిలో కొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది. ఆవుపాలు సులభంగా జీర్ణమవుతుంటాయి. వీటిలో బీటా కెరోటిన్ ఏ విటమిన్ గా మార్పు చెంది చిన్నారులకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తి తేడాలను బట్టి ఆయా జంతువుల పాలు రంగులలో మార్పులు కనిపిస్తాయి. ఆవు పాటు, గేదె పాల వల్ల కొన్ని లాభాలు, నష్టాలు ఉంటాయి. ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలులో 3 నుంచి 4 శాతం కొవ్వు ఉంటే గేదె పాలలో 7 నుంచి 8 శాతం కొవ్వు ఉంటుంది. దీంతో జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాదు.. ఆవుపాలలో 90 శాతం నీళ్లుంటాయి. ఇది డిహైడ్రేషన్ కి గురికాకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది. గేదెపాలలో మాత్రం అది కుదరదు.  

Advertisement

Also Read :  కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న

ప్రోటీన్ల విషయానికి వస్తే.. ఆవుపాలత పోల్చితే గేదె పాలలో 10 శాతానికి పైగా ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల గేదె పాలు పెద్దలకు మంచివని చెబుతుంటారు నిపుణులు. ఈ రెండు పాలలో ఉండే కేలరీల శాతం చూసినట్టయితే గేదె పాలలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. గేదె పాలలో కొవ్వు పదార్థం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడంతో గేదె పాలలో 237 కేలరీలుంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలుంటాయి. ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి. శక్తి ఎక్కువగా కావాలంటే గేదె పాలు, తక్కువగా కావాలంటే ఆవు పాలు తాగడం ఉత్తమం. 

Also Read :  వెయ్యి రూపాయలు గూగుల్ పే చేసిన బండ్ల గణేష్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading