Home » అయ్య‌ప్ప భ‌క్తులు ఇరుముడి ఎందుకు క‌డుతారో తెలుసా? ఇరుముడి అంటే?

అయ్య‌ప్ప భ‌క్తులు ఇరుముడి ఎందుకు క‌డుతారో తెలుసా? ఇరుముడి అంటే?

by Bunty
Ad

కార్తిక మాసం రావ‌డం తో అయ్య‌ప్ప భ‌క్తుల సంద‌డి ఎక్కువ గా ఉంటుంది. కార్తిక మాసం నుంచి సంక్రాంతి వ‌ర‌కు అయ్య‌ప్ప భ‌క్తుల దీక్ష‌లు.. స్వామి శ‌ర‌ణం అయ్య‌ప్ప.. అనే పాట‌ల తో కోలాహాలం గా ఉంటుంది. అయితే అయ్య‌ప్ప భక్తుల చేతి లో ఉండే ప్ర‌ధానమైనది ఇరుముడి. అయ్యప్ప భ‌క్తుల మండ‌ల దీక్ష అయిన త‌ర్వాత శ‌బ‌రిమ‌ల‌లో ఉన్న అయ్య‌ప్ప స్వామి ని ద‌ర్శించు కోవ‌డానికి ఇరుముడి క‌ట్టుకుని బ‌య‌లు దేరుతారు. ఈ ఇరుముడి విష‌యం లో అయ్య‌ప్ప భ‌క్తులు అత్యంత భ‌క్తి తో ఉంటారు. అస‌లు ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్థం. ఈ రెండిటి ని భ‌క్తి, శ్ర‌ధ్ద తో పోలుస్తారు. ఇలా చేస్తే అయ్య‌ప్ప స్వామి అనుగ్ర‌హం పొందుతార‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

Advertisement

Advertisement

ఈ ఇరుముడి ని కేవలం గురు స్వామి క‌డుతారు. ఒక ముడి లో అయ‌ప్ప స్వామి పూజా సామ‌గ్రి ఉంటుంది. అలాగే మ‌రొక ముడి లో నీళ్లు తీసివేసిన కొబ్బ‌రి కాయ లో స్వ‌చ్ఛ మైన ఆవు నెయ్యి తో నింపుతారు. దీనికి గ‌ల కార‌ణం.. జీవాత్మ‌.. ప‌ర‌మాత్మ‌ల‌ను అనుసందానం చేయ‌డం అని అంటారు. ఈ ఇరుముడి ని అయ్య‌ప్ప భ‌క్తులు నెత్తిన పెట్టుకుని స్వామియే.. అయ్య‌ప్ప‌.. అంటూ శ‌బ‌రిమ‌ల కు వెళ్తారు. అక్క‌డ 18 మెట్లు ఎక్కి అయ్య‌ప్ప స్వామి ద‌ర్శించుకుంటారు. అయితే ఇరుముడి లేని భ‌క్తుల‌కు ఈ 18 మెట్లు ఎక్క‌డానికి అనుమ‌తి ఉండ‌దు. అందుకే ప్ర‌తి అయ్య‌ప్ప భ‌క్తుడు త‌ప్ప‌కుండా ఇరుముడి ని క‌డుతారు.

ఆ ఇరుముడి 18 మెట్లు ఎక్కిన త‌ర్వాత విప్పి అయ్య‌ప్ప స్వామి పూజా చేస్తారు. ఆ కొబ్బ‌రి కాయ లో ఉన్న నేయ్యి తో అయ్య‌ప్ప స్వామి కి అభిషేకం చేస్తారు. త‌ర్వాత అనేక పుణ్య క్షేత్రాలను ద‌ర్శించుకుని తిరిగి ఇంటికి వ‌స్తారు. ఇంటి కి వ‌చ్చిన త‌ర్వాత త‌ల్లి తో అయ్య‌ప మాల ను తీయించుకుంటారు. కొంత మంది ఏదైనా.. ఆలయం లో పూజారి తో కూడా అయ్య‌ప్ప మాల తీయించుకుంటారు. మాల తీసినా.. చాలా మంది మాల ఉన్న స‌మ‌యం లో ఉన్న‌ట్టే నిష్ట గా ఉంటారు.

Also Read: ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట‌వేయాలంటే ఇలా చేయండి..!

Visitors Are Also Reading