Home » ఏటీఎం పిన్ ఎందుకు నాలుగు డిజిట్స్ ఉంటుందో తెలుసా?

ఏటీఎం పిన్ ఎందుకు నాలుగు డిజిట్స్ ఉంటుందో తెలుసా?

by Bunty
Ad

ప్ర‌స్తుత డిజిట‌ల్ కాలంలో ఎక్కువ గా ఆన్ లైన్ చెల్లింపు జరుపుతున్నాం. ముఖ్యం గా కరోనా మ‌హ‌మ్మారి వ‌చ్చిన నాటి నుంచి క‌రెన్సీని త‌క‌కుండా డిజిట‌ల్ చెల్లింపుల‌కే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. నిజానికి డిజిట‌ల్ చెల్లింపులు నోట్ల ర‌ద్దు అయిన నాటి నుంచి ఊపు అందుకున్నాయి. అయితే మ‌నం డిజిట‌ల్ చెల్లింపులు జ‌ర‌పాలంటే ఎక్కువ వినియోగించే వాటిల‌లో ఏటీఎమ్ కార్డ్ ముఖ్య మైన‌ది. ఈ ఏటీఎమ్ కార్డు తోనే ఫోన్ పై, గుగూల్ పే లు క్రియేట్ చేశాం. అయితే ఒక్కోసారి ఏటీఎమ్ కార్డుల తో ఏటీఎమ్ మెషిన్ ల నుంచి డ‌బ్బులు తీస్తాం. అలాగే ఏటీఎమ్ ను స్వైప్ చేస్తు కొన్ని సార్లు డ‌బ్బులు చెల్లిస్తాం.

Advertisement

Advertisement

ఇలా ఏటీఎమ్ కార్డు ల‌ను ఎక్కువ గా ఉపయోగిస్తాం. అయితే ఏటీఎం కార్డు కి ఒక సిక్రెట్ పిన్ ఉంటుంది. అది కేవ‌లం నాలుగు అంకెలు మాత్ర‌మే ఉంటుంది. అయితే ఏటీఎం కార్డు పిన్ కేవ‌లం నాలుగు అంకెలు మాత్ర‌మే ఎందుకు ఉంటుంద‌ని ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు మ‌నం ఏటీఎం కార్డు పిన్ ఎందుకు నాలుగు అంకెలు మాత్ర‌మే ఉంటుందో తెలుసుకుందాం. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్ల‌ర్ మెషిన్. ఈ ఏటీఎం ను బ్రిటీష్ దేశ‌స్థుడు అయిన జాన్ అడ్రియ‌న్ షెవ‌ర్డ్ బార‌న్ అనే వ్య‌క్తి క‌నిపెట్టాడు. అలాగే ఏటీఎం కార్డు ను కూడా అత‌డే క‌నిపెట్టాడు.

అయితే మొద‌ట తాను ఏటీఎం కార్డు ఉప‌యోగించే స‌మ‌యంలో 6 అంకెల సిక్రెట్ పిన్ ను ఎంచుకున్నాడు. అయితే జాన్ అడ్రియ‌న్ షెవ‌ర్డ్ బార‌న్ భార్య కారోలిన్ ఈ ఆరు అంకెల ఏటీఎం పిన్ ను తిర‌స్క‌రించింది. ఎందుకంటే ఆమె ఒక సారి ఏటీఎం తీసుకుని ఉప‌యోగించే స‌మ‌యంలో ఆ సిక్రెట్ పిన్ ను మ‌ర్చిపోయింది. 6 అంకెల కంటే 4 అంకెలు ఉంటే సులువు గా గుర్తు ఉంచుకోవ‌చ్చ‌ని త‌న భ‌ర్త జాన్ అడ్రియ‌న్ షెవ‌ర్డ్ బార‌న్ తో చెప్పింది. అప్ప‌టి నుంచి 4 అంకెల ఏటీఎం పిన్ అందుబాటు లోకి వ‌చ్చింది. నిజానికి 4 అంకెల పిన్ అయితే సులువు గా గుర్తు పెట్టుకోవ‌చ్చు.

Visitors Are Also Reading