Home » Bigboss6 :ఉదయభాను అంటే ఆ వ్యక్తికి అంత పగేంటో.. బిగ్ బాస్ లోకి రాకుండా ఆపింది అతడేనా ..?

Bigboss6 :ఉదయభాను అంటే ఆ వ్యక్తికి అంత పగేంటో.. బిగ్ బాస్ లోకి రాకుండా ఆపింది అతడేనా ..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్బాస్ సీజన్ 6 ఇప్పటికే ప్రారంభమై ఐదు రోజులు గడిచింది.. 21మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేస్తున్నారు. ఎవరి టాలెంట్ ను వారు చూపించుకుంటూ ప్రేక్షకుల మనస్సు గెల్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రూపులు, గొడవలు,అలకలు, ఓదార్పులు,డాన్సులు అబ్బా ఒకటా రెండా ఇలా ఎవరికి వారే వారి వారి టాలెంటుతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే పనిలో పడ్డారు.. ఎవరు ఎలా ఉన్నారు అనేది చూసే జనాలకి మాత్రం క్లియర్ గా అర్ధం అవుతుంది. వారి పర్ఫామెన్స్ ని ఎప్పటికప్పుడు ఎడిటర్ గమనిస్తూనే ఉంటారు. ఏ విధంగా అయితే అర్థం కావాలో ఆ విధంగా కట్ చేసి ఎడిట్ చేసి మరీ టెలికాస్ట్ చేస్తారు. దీంతో బిగ్ బాస్ రేటింగ్ విపరీతంగా పెరిగిపోతుంది..

Advertisement

ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ఉదయభాను వస్తుందని అందరూ అనుకున్నారు.. దీంతో ఈ అమ్మడు పేరు మాత్రం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయింది..బిగ్ బాస్ హౌస్ లో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఉదయభానునే అనే వార్తలు కూడా వచ్చాయి. దీనికోసం ఈమె కొన్ని కండీషన్స్ పెట్టిందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కట్ చేస్తే.. ఉదయభాను హౌస్ లో కి వెళ్ళలేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ఎందుకు ఉదయభాను హౌస్ లోకి రాలేకపోయిందొ తెలుసుకునే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలోనే దీనికంతటికీ కారణం నాగార్జున అని తెలిసింది.. ఆమెను హౌస్ లోకి రాకుండా ఆపింది హోస్ట్ నాగార్జునే నట. దీనికి కారణం గతంలో నాగార్జున కు ఉదయభాను కు ఉన్న విభేదాలే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

also read:ఈవెంట్ అని చెప్పి పర్సనల్ గా కలవమన్నారు.. గలాటా గీతూ షాకింగ్ కామెంట్స్..!!

అయితే వాస్తవానికి హోస్ట్ గా రావలసింది నాగార్జున కాదని మరో హీరో అని,కానీ చివరి సమయంలో హీరో హ్యాండ్ ఇవ్వడంతో నాగార్జున వచ్చారని తెలుస్తోంది. ఈ సమయంలోనే ఉదయభానుని కూడా బిగ్ బాస్ రిజెక్ట్ చేయడం.. అగ్రిమెంట్ పై సైన్ చేయించుకోకుండా ఉదయభానుని హోల్డ్ లో పెట్టడం ఇది అంతా ఉదయభాను కు అర్థమైంది.దీంతో ఆమెను ఆపింది నాగార్జున అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో, ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

also read:అమ్మో ఇదేం ట్విస్ట్ రా బాబు..ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తల్లి.. కానీ తండ్రులు వేరట..!!

Visitors Are Also Reading