Home » నిఖిల్ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపింది ఎవరో తెలుసా..?

నిఖిల్ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపింది ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో యంగ్ హీరోలలో నిఖిల్ కూడా ఒకరు.. ఆయన ఇప్పటికే పలు సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో కష్టపడుతూ ముందుకు పోతున్నారు.. అలాంటి నిఖిల్ ఇప్పటికే కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.. అదే స్ఫూర్తితో చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమాను తెరకెక్కించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసింది.. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.. ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీన థియేటర్ లోకి వచ్చింది.వచ్చిన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా దూసుకుపోతోంది.. ఈ సినిమా నార్త్ లో మాత్రం విపరీతంగా దూసుకుపోతుందని చెప్పవచ్చు..

Advertisement

ఇదంతా ఒక ఎత్తయితే సినిమా రిలీజ్ కు ముందు ఈ మూవీని బలవంతంగా పోస్ట్ పోన్ చేయిస్తున్నారని హీరో నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని బయట పెట్టారు.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళ ఇబ్బందులు ఇలాగే ఉంటాయని కార్తికేయ 2 సినిమాతో స్పష్టం చేశారు.. బ్యాక్గ్రౌండ్ లేకుంటే వారి సినిమాలను పక్కకు తప్పిస్తూ ఉంటారు.. నా సినిమా విషయంలో కూడా ఇలా జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఐదు రోజుల కిందట నేను సినిమా కోసం ఏడ్చాను అని చెప్పడం సంచలనంగా మారింది. అతడి సినిమాని జూలై 22వ తేదీన విడుదల చేయాలని అనుకుంటే వెనక్కి వెళ్ళమని అడ్డు పడ్డారని, మళ్లీ ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేద్దామనుకుంటే మళ్లీ అడ్డు పడి అక్టోబర్ లేదా నవంబర్లో చేయమన్నారు అని మీడియా ఎదుట తన బాధను చెప్పుకున్నారు..

Advertisement

అలా చేయకపోతే ఈ సినిమా రిలీజ్ కాదు థియేటర్లు దొరకవు, నీకు థియేటర్ లు కూడా ఇవ్వము అనే స్టేజి దాకా వెళ్లారని, ఆ మాట విన్న నేను రోజంతా ఏడ్చనని చెప్పుకొచ్చారు నిఖిల్.. మరి ఈ విధంగా హీరో నిఖిల్ ను అన్నది ఎవరు.. బాధ పెట్టింది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే నిఖిల్ చెప్పిన తేదీల్లో మాత్రం దిల్ రాజ్ నిర్మించిన థాంక్యూ, మాచర్ల నియోజకవర్గం, బింబిసారా మూవీస్ మాత్రమే ఉన్నది.. దీంతో చాలామంది దిల్ రాజు వల్లే నిఖిల్ సినిమా వాయిదా పడుతూ వచ్చిందని అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన దిల్ రాజు వాస్తవాలు తెలుసుకొని రాయండి అంటూ బదులిచ్చారు.. ఈ విధంగా దిల్ రాజ్ క్లారిటీ ఇవ్వడంతో అసలు నిఖిల్ సినిమాని ఆపింది ఎవరు, ఆయన ను బెదిరించిన ఆ ఆకాశ రామన్న గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది..

ALSO READ;

త‌న ఆస్తి మొత్తాన్ని గుళ్ల‌కు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు ఇచ్చిన ఈ న‌టి గురించి మీకు తెలుసా..?

అల్లుఅర్జున్ స‌తీమ‌ణి ఫోటోల‌పై క‌ళ్యాణ్ దేవ్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

 

Visitors Are Also Reading