మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. దాసరి నారాయణరావు తరువాత ఇనీ పెద్ద ఎవ్వరంటే మెగాస్టార్ అనే చెప్పవచ్చు. కరోనా సమయంలో ఎంతో మంది చిత్ర పరిశ్రమలో పని చేసే కార్మికులకు అండగా నిలిచారు చిరంజీవి. ఇదిలా ఉంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన దైన స్టైల్ లో డ్యాన్స్ తో అభిమానులను మెప్పించి మెగాస్టార్ గా ఇప్పుడు ఇండస్ట్రీనే ఏలేస్తున్నాడు.
Advertisement
మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది కొత్త హీరోలు వచ్చారు. ఒక్క హీరోకి మాత్రం ఈయన ముందే నువ్వు ఇండస్ట్రీలో పైకి రాలేవని చెప్పాడట. ఇక మెగా ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ అందులో సక్సెస్ అయింది చాలా తక్కువ. మెగాస్టార్ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతీ హీరో స్టార్ హీరో అయిపోలేదు. ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారు. అయితే మెగాస్టార్ కొడుకు రామ్ చరన్ ఆయన తమ్ముడు నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో అరకొర హిట్లు కొట్టారు. కానీ మెగా మాజీ అల్లుడు కల్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు.
Advertisement
ఇక కనీసం హీరో అనే గుర్తింపు కూడా తెచ్చుకోలేదు. ఈ హీరోకి మెగాస్టార్ చిరంజీవి ముందే హింట్ ఇచ్చేశారట. బాబు సినీ ఇండస్ట్రీలో అందరూ నెట్టుకురాలేదు. దానికి ఓ సపరేట్ స్టామినా టాలెంట్ ఉండాలి. నువ్వు బిజినెస్, సినిమాల ప్రొడ్యూసింగ్ వైపు వెళ్లితే బాగుంటుందని నా అభిప్రాయమని చెప్పగా.. కళ్యాణ్ దేవ్ ఒప్పుకోలేదట. నాకు సినిమాలు అంటే ఇష్టం అంకుల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటూ పట్టుబట్టారట. చివరికీ చిరంజీవి చెప్పినట్టే జరిగింది. చివరికీ ఈ మెగా మాజీ అల్లుడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీసినా కానీ సక్సెస్ మాత్రం సంపాదించలేకపోయాడు.
Also Read :
ఆర్తి అగర్వాల్ విషం తాగడానికి గల కారణాన్ని చెప్పిన తరుణ్ తల్లి..!