Home » ఎన్టీఆర్ ని ‘శ్రీవారు’ అని ప్రేమగా పిలిచే అలనాటి ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే ?

ఎన్టీఆర్ ని ‘శ్రీవారు’ అని ప్రేమగా పిలిచే అలనాటి ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే ?

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో, రాజకీయాల్లో ఏ రంగంలోనైనా తనదైన ముద్ర వేసుకున్నారు. సిని రంగంలో అయితే అన్నగారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.  తాను సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎలా ఎక్కి అంచెలంచెలుగా ఎలా ఎదిగానే పలు సందర్భాల్లో చెప్పేవారట. చాలా మందికి ఇలా ఉండాలి బ్రదర్ అని సూచించేవారట ఎన్టీఆర్. ముఖ్యంగా మనీ+టైమ్ = జీవితం అనే ఓ ఫార్ములాను చాలా మందికి చెప్పేవారట ఎన్టీఆర్. సమయం ప్రకారం వచ్చామా..? లేదా..? చెప్పింది చేశామా..? ఇచ్చింది తీసుకున్నామా అనే కాన్సెప్ట్ తో పని చేసేవారట.  ఇలా కొద్ది రోజుల పాటు జీవించి చూడు నీ జీవితం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుందని సలహా ఇచ్చేవారట. 

srntr

Advertisement

ఇలా చాలా మంది ఎన్టీఆర్ సలహాలు పాటించి తమ జీవితాలను సుసంపన్నం చేసుకున్న హీరోలున్నారు. ప్రధానంగా వీరిలో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, చంద్ర మోహన్,  కైకాల సత్యనారాయణ వంటి వారు కనిపిస్తారు. కేవలం హీరోలు మాత్రమే కాదు.. ఎన్టీఆర్ మాట పలువురు హీరోయిన్లు కూడా చాలా మంది విన్నారు. అలా వారు మంచి జీవితాన్ని కొనసాగించారు. అలాంటి వారిలో ఊర్వశి, శారద ఉన్నారు.  ముఖ్యంగా శారదకు ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ ని శారద షూటింగ్ ల సమయంలో శ్రీవారు అని పిలిచేవారట. చాలా క్యారెక్టర్ పాత్రల్లో నటించిన శారద ఎన్టీఆర్ కి ఎక్కువగా భార్యగా నటించారు. 

Advertisement

Also Read :  నరేష్ కు పవిత్ర దగ్గరవ్వడానికి అసలు కారణం అదేనా…? మూడో భార్య ఏం చెబుతోంది..!

NTR-Sharada

NTR-Sharada

మేజర్ చంద్రకాంత్ సినిమాలో చివరిగా ఎన్టీఆర్, శారద కలిసి నటించారు. ఈ చిత్రంలో కూడా వీరిద్దరూ భార్య భర్తలుగానే నటించారు. ప్రధానంగా అన్నగారు చెప్పిన పలు ఆర్థిక సూత్రాలను శారద తన జీవితంలో అనుసరించారు. నటిగా నటించినా.. ఎంపీగా బాధ్యతలు చేపట్టినా ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఇందుకు ఎన్టీఆర్ చెప్పినటువంటి ఆర్థిక సూత్రాలే ముఖ్యమైన కారణం అని పలు సందర్భాల్లో గుర్తు చేసేవారు. ఎన్టీఆర్ నేరుగా తనకు సూత్రాలు చెప్పలేదు అని.. కొన్నిసందర్భాల్లో మాత్రమే చెప్పారు. మిగతా సందర్భాల్లో వేరే వారికి చెప్పిన సూత్రాలను విని తాను ఆచరించినట్టు తెలిపారు.  ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ చెప్పిన మాటలు విని ఎంతో మంది మంచి సక్సెస్ సాధించారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకోవడం గొప్ప విషయం. 

Also Read :   రాజమౌళి సినిమాల్లోకి రావడానికి కారణం ఆవిడే అని తెలుసా….? ఆవిడ జక్కన్నకు రెండో తల్లి లాంటివారు..!

Visitors Are Also Reading