Home » “శంకర్ దాదా ఎంబీబీఎస్” సినిమాలో ఏటీఎమ్ పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోను అనుకున్నారట..కానీ..!

“శంకర్ దాదా ఎంబీబీఎస్” సినిమాలో ఏటీఎమ్ పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోను అనుకున్నారట..కానీ..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవి వయసు పెరిగిన మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటించాడు. అప్పటివరకు దాదాగిరి చేసిన చిరంజీవి తన తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు.

Advertisement

అందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. ఈ ఈ క్రమంలో ఎంబీబీఎస్ సీటు సంపాదించి మెడికల్ కాలేజి లో చేరుతాడు. ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు హైలెట్ నిలిచాయి. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా సినిమాలో చిరు ఆయన తండ్రి మధ్యలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

Advertisement

ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ చిరంజీవికి రైట్ హ్యాండ్ గా ఏటీఎం అనే ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఏటీఎం పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ పాత్రను శ్రీకాంత్ కు ఇచ్చారు. శ్రీకాంత్ వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో మెగాస్టార్ ను కలవడానికి వెళ్లారు.

అప్పుడు శ్రీకాంత్ ను మెగాస్టార్ ఏం చేస్తున్నావ్ అని అడగ్గా…. ఖాళీగా ఉన్నానని చెప్పారు. దాంతో చిరంజీవి తాను శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో నటిస్తున్నానని ఆ సినిమాలో తనకు రైట్ హ్యాండ్ గా చేయాలని శ్రీకాంత్ కు చెప్పారట. అంతేకాకుండా సినిమా దర్శకుడికి కూడా వెంటనే చిరంజీవి ఫోన్ చేసి చెప్పారు. అలా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా లో శ్రీకాంత్ నటించారు.

Also read :

య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకునేలా సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టింది ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading