Home » బాలకృష్ణ కి రూ.25లక్షల ఖరీదైన వాచ్ ని బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా ? 

బాలకృష్ణ కి రూ.25లక్షల ఖరీదైన వాచ్ ని బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా ? 

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్స్ ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య తాజాగా వీరసింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ చిత్రం జనవరి 12న విడదల కానుంది. తాజాగా విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో బాలయ్య అభిమానులు సంబురపడుతున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమా నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అందుకు సంబంధించిన అంశాలన్నీ కూడా వీరసింహారెడ్డిలో ఉండనున్నట్టు మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీమేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. 

Advertisement

మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య విశ్వరూపాన్ని చూడబోతున్నామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు దాదాపు 10 వరకు ఉన్నట్టు సమాచారం. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో తండ్రి రోల్ పోషించిన బాలయ్య నటన సినిమాకే హైలెట్ గా నిలిచే విధంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బాలయ్య-వరలక్ష్మీ కాంబినేషన్ లో వచ్చే సీన్లు చాలా ఎమోషనల్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య చాలా పవర్ పుల్ పాత్రలో కనిపించనున్నట్టు  సమాచారం. మరోవైపు ఫస్టాప్ లోని 20 నిమిషాల సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్ గా నిలువనున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Also Read :  ఎన్టీఆర్ పక్కన నటించడానికి జాన్వీ కపూర్ అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా…?

Manam News

పొలిటికల్ గా కనెక్ట్ అయ్యే డైలాగ్ లు ఈ చిత్రంలో చాలా ఎక్కువగానే ఉన్నాయట. ఇదిలా ఉంటే.. ఇటీవల ఒంగోలు లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బాలకృష్ణ ధరించిన వాచ్ హైలెట్ గా నిలిచిన విషయం విధితమే. అయితే ఈ వాచ్ ఖరీదు ఏకంగా రూ.25లక్షలు అని సమాచారం. రూ.25లక్షల విలువైన వాచ్ ని బాలయ్యకి కూతురు బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. నారా బ్రాహ్మణి తన తండ్రిపై ప్రేమను ఈవిధంగా చూపించారా..? అని నెటిజన్లు నుంచి పలు కామెంట్లు వస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. వీరసింహారెడ్డి తరువాత దర్శకుడు అనీల్ రావిపూడితో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కొంత వరకు కొనసాగినట్టు సమాచారం. మరోవైపు బోయపాటితో ఓ సినిమాను కూడా చేయనున్నాడు. వరుసగా పవర్ పుల్ ప్రాజెక్ట్ లలో నటిస్తూ తన కెరీర్ ని సక్సెస్ పుల్ గా కొనసాగిస్తున్నారు బాలయ్య.

Also Read :  ఆంధ్రావాలా నుంచి అజ్ఞాతవాసి వరకు సంక్రాంతికి డిజాస్టర్ గా నిలిచిన 15 సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading