Home » చంటి మూవీని మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

చంటి మూవీని మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాల విషయంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. దర్శక నిర్మాతలు కొంతమంది హీరో హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని వారికి తగ్గట్టు కథలు రాస్తూ ఉంటారు. ఈ తరుణంలో కథ పూర్తయిన తర్వాత ఆ హీరో హీరోయిన్ కు ఆ కథ వినిపిస్తే నచ్చక రిజెక్ట్ చేసిన సందర్భలు అనేకం ఉంటాయి. దీంతో ఆ కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటారు. అలాంటిదే చంటీ కథ.. రవి రాజా పినిశెట్టి డైరెక్షన్లో వెంకటేష్,మీనా కాంబినేషన్లో వచ్చిన మూవీ చంటి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు.

Advertisement

Also read;15 వారాలు ఇంట్లో ఉన్నా కీర్తికి వచ్చింది అంతేనా…అన్ని లక్షలు మిస్ చేసుకుందిగా…!

Advertisement

ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పటికీ 30 సంవత్సరాలకు పైగానే అయింది. ఇందులో వెంకటేష్ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇందులో వెంకటేష్ చంటి పాత్రలో అమాయక పల్లెటూరి యువకుడిగా నటిస్తారు. అయితే ఈ చిత్రంలో మొదట హీరో రాజేంద్రప్రసాద్ అనుకున్నారట. ఆ టైంలోనే చిన్న తంబి సినిమాను రామానాయుడు చూశారట. ఈ మూవీ రీమేక్ రైట్స్ కే ఎస్ రామారావు కొనుగోలు చేశారు. ఈ చిత్రంలో హీరోగా చేయడానికి ఒప్పించారు.

అయితే ఈ మూవీ వెంకటేష్ కూడా బాగా నచ్చడంతో కేఎస్ రామారావు రవి రాజా పినిశెట్టికి వెంకటేష్ ను హీరోగా పెట్టి చేయాలని చెప్పేశారు. కానీ రవి రాజా పినిశెట్టి మాత్రం హీరో రాజేంద్రప్రసాద్ కి ఎప్పుడో మాట ఇచ్చాను చేస్తే అతనితోనే చేస్తానని పట్టు పట్టడంతో హీరో చిరంజీవి రంగంలోకి దిగి రవి రాజా పినిశెట్టి వెంకటేష్ మీనాలతో ఈ సినిమా తీయించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

Also read;భర్త చనిపోయినా కానీ మళ్ళీ పెళ్లి చేసుకోని సినీ తారలు.. ఎవరంటే..?

Visitors Are Also Reading