సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలు, దర్శకులు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా, వాళ్ళు కూడా స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఇటీవల లేజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యంతో వచ్చిన అనారోగ్య కారణాలవల్ల ఆయన కన్నుమూశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
Advertisement
కమల్ హాసన్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు ఆయన సూపర్ హిట్ లను అందించారు. దర్శకుడి గానే కాకుండా నటుడిగా కూడా ఆయన సినిమాలు చేశారు. అయితే ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ తన వారసులను మాత్రం ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ఇది ఇలా ఉండగా, డైరెక్టర్ విశ్వనాథ్ ఈ తరంలో నచ్చిన హీరో గురించి గతంలో ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా నేటితరం హీరోలలో ఏ హీరో అంటే మీకు ఇష్టం అంటూ ఈయనకు ఓ ప్రశ్న ఎదురైంది.
Advertisement
అయితే ఈ ప్రశ్నకు విశ్వనాధ్ గారు సమాధానం చెబుతూ ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోలు అందరూ కూడా అద్భుతమైన నటన కనబరుస్తున్నారని తెలిపారు. అయితే అందరిలో కన్నా తనకు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటన చాలా బాగా నచ్చుతుందని విశ్వనాథ్ తెలిపారు. ఇలా వీరిద్దరి నటన నచ్చుతుంది అంటే మిగతా హీరోలు మంచిగా నటించరని అర్థం కాదు అంటూ గతంలో విశ్వనాథ్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Advertisement
READ ALSO : ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు.. 12 వేల జీతం.. పూర్తి వివరాలు ఇవే!