Home » భార‌త రాజ్యాంగం ఒరిజిన‌ల్ కాపీ ఎక్క‌డుందో మీకు తెలుసా..?

భార‌త రాజ్యాంగం ఒరిజిన‌ల్ కాపీ ఎక్క‌డుందో మీకు తెలుసా..?

by Anji
Ad

రాజ్యాంగం గురించి చాలా మందికి చాలా ప్ర‌శ్న‌లు త‌లెత్తున్నాయి. అస‌లు భార‌త రాజ్యాంగం అస‌లు కాపీ ఎక్క‌డ ఉంది..? ఎన్ని కాపీలు ఉన్నాయి..? వాటిని ఎలా ఉంచుతారు..? ఇలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇవాళ ఏప్రిల్ 14 డాక్ట‌ర్ బీ.ఆర్‌. అంబేద్క‌ర్ జ‌యంతి. భార‌త రాజ్యాంగాన్ని రూపొందించ‌డంలో అంబేద్క‌ర్ కృషి ఎన‌లేనిది. రాజ్యాంగాన్ని రూపొందించిన ముసాయిదా క‌మిటీకి అంబేద్క‌ర్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు.

Advertisement

ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి మూడు అస‌లు కాపీలున్నాయి. ఈ కాపీల‌న్ని పార్ల‌మెంట్ సెంట్రల్ లైబ్ర‌రీలో భ‌ద్ర‌ప‌రిచారు. మూడు గ‌దుల‌తో కూడిన సెక్యూరిటీ ఎన్‌క్లోజ‌ర్ ఉంది. కొన్ని సంద‌ర్భాల్లో చూసేందుకు అవ‌కాశం కూడా క‌ల్పిస్తారు. రాజ్యాంగం అస‌లు కాపీ 22 అంగుళాల పొడ‌వు, 16 అంగుళాల వెడ‌ల్పుతో ఉంటుంది. ఇది పార్చ్‌మెంట్ షీట్ల‌పై రాసారు. దాని మాన్యుస్క్రిప్ట్‌లో 251 పేజీలుంటాయి.


రాజ్యాంగాన్ని రూపొందించ‌డానికి 2 సంవ‌త్స‌రాల 11 నెల‌ల 18 రోజులు ప‌ట్టింది. రాజ్యాంగాన్ని న‌వంబ‌ర్ 26, 1949న రాజ్యాంగ స‌భ ఆమోదించింది. భార‌త రాజ్యాంగాన్ని రూపొందించ‌డానికి 1947 ఆగస్టు 29న ముసాయిదా క‌మిటీ ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ భీమ్‌రావు అంబేద్క‌ర్‌. ప్ర‌పంచంలోని అన్ని రాజ్యాంగాల‌ను నిశితంగా ప‌రిశీలించి రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని భ‌ద్ర‌ప‌ర‌చ‌డం కోసం అత్యంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ముఖ్యంగా హీలియం వాయువుతో నింపిన పెట్టెలో ఉంచారు.

Advertisement

రాజ్యాంగాన్ని ముద్రించింది కాదు. స్వ‌యంగా చేతితో రాసారు. చేతితో రాసిన అతిపెద్ద రాజ్యాంగం భార‌త్ దే కావ‌డం విశేషం. ఇంగ్లీషు, హిందీ రెండు భాషల్లో భార‌త రాజ్యాంగాన్ని రాశారు. దీనికోసం బ్లాక్ పెన్ను ఉప‌యోగించారు. దానికి ఆక్సిజ‌న్ తోడు అయితే కాల‌క్ర‌మేనా ఇంకు ఆవిరి అవుతుంది. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండేందుకు గాలి చొర‌బ‌డ‌కుండా హీలియం నింపిన బాక్సులో పెట్టారు. దానిపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. ప్రతి రెండు నెల‌ల‌కొక‌సారి ప‌రిశీలిస్తారు.


భార‌త రాజ్యాంగం ఒరిజిన‌ల్ కాపీపై జ‌న‌వ‌రి 24, 1950లో రాజ్యాంగ ప‌రిష‌త్‌లో 284 మంది స‌భ్యులు సంత‌కం చేశారు. ఆ కాపీపై తొలి సంత‌కమును భార‌త తొలి రాష్ట్రప‌తి డాక్ట‌ర్ బాబు రాజేంద్ర‌ప్ర‌సాద్ చేయ‌లేదు. మొట్ట‌మొద‌టి ప్ర‌ధాని అయిన‌టువంటి పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు తొలి సంత‌కం చేశారు. రాష్ట్రప‌తి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ తో స‌హా 46 మంది సంత‌కాలు హిందీలో చేసారు. వారిలో 15 మంది మ‌హిళ‌లు రాజ్యాంగం తొలి కాపీపై సంత‌కాలు చేశారు.

ఇవి చద‌వండి :

  1.   టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలో వీటిని అస్స‌లు తీసుకోకూడ‌దు జాగ్ర‌త్త‌..!
  2. చెర‌కు ర‌సం త‌యారు చేసేట‌ప్పుడు గ‌డ‌ల మ‌ధ్య నిమ్మ‌కాలు ఎందుకు ఉంచుతారో తెలుసా..?
  3. ఆర్సీబీ టైటిల్ గెలిచే వరకు పెళ్లి చేసుకోను.. అయితే అంతే సంగతి..!
Visitors Are Also Reading