Home » ది కేరళ స్టోరీ మూవీని కాపీ చేశారా ? దాని ఆధారంగానే..!

ది కేరళ స్టోరీ మూవీని కాపీ చేశారా ? దాని ఆధారంగానే..!

by Anji
Published: Last Updated on
Ad

వివాదాస్పద చిత్రంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మూవీ ‘ది కేరళ స్టోరీ’. మే 07న దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలపై వ్యతిరేకత వ్యక్తం అయిననేపథ్యంలో దక్షిణాదిలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదలయ్యే థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్ లో యజమాన్యాలు ఈ సినిమాని ప్రదర్శించకూడదని ఆన్ లైన్ టికెట్ బుకింగ్ తొలగించారు. 

Also Read :  అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

Advertisement

kerala-story-review

సినిమాకి పెద్ద ప్రమోషన్ జరగకపోయినా భారీ ఎత్తున పబ్లిసిటీ వచ్చింది. ఈ మూవీకి ప్రస్తుతం విడుదలైన చోట్ల జనాలు క్యూ కడుతున్నారు. కొత్త సినిమాలు రామబాణం, ఉగ్రం కన్నా ది కేరళ స్టోరి మూవీనే జనం వీక్షించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సెన్సార్ ఆలస్యం కావడంతో తెలుగు వర్షన్ కాస్త ఆలస్యం అయింది. అయితే “ది కేరళ స్టోరీ” సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఇది ఒరిజినల్ స్టోరీ కాదని కామెంట్  చేస్తున్నారు.

Advertisement

2020లో నెట్ ఫ్లిక్స్ లో “కాలిఫెట్ అనే స్వీడిష్” అనే వెబ్ సిరీస్ ఆధారంగా తీసిన సినిమా అని పేర్కొంటున్నారు. ఆ వెబ్ సిరీస్ లో కూడా బ్రెయిన్ వాష్ కు గురైన నలుగురు అమ్మాయిల చుట్టూనే స్టోరీ తిరుగుతుంది.  ఐసీసీ తీ*వాదులు వచ్చిన పడి ప్రమాదంలో నెట్టబడిన వైనాన్ని కళ్ళకు కట్టినట్లు… చూపిస్తారు. ఆ వెబ్ సిరీస్ లో బ్యాక్ డ్రాప్ యూరప్ అయితే… ది కేరళ స్టోరీ లో కేరళ నుంచి సిరియా అన్నట్టుగా చూపించారు. రెండింటిలో  పోలికలు చాలా వరకు దగ్గరగా ఉన్నాయని చెబుతున్నారు. 

Also Read :  దాసరిని పక్కన పెట్టి లంకేశ్వరుడు సినిమాలోని పాటలను చిరంజీవి ఎందుకు చిత్రించారు…?

Visitors Are Also Reading