Home » బాలయ్య అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వచ్చేది ఎప్పుడో తెలుసా ?

బాలయ్య అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వచ్చేది ఎప్పుడో తెలుసా ?

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ ఓ వైపు వరుస సినిమాలతో దూసుకెళ్తూనే.. మరోవైపు అన్ స్టాపబుల్ షోతో కూడా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఎక్కిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ లో ఫుల్ జోష్ తో ఎంటర్ టైన్ చేసిన బాలకృష్ణ సీజన్ 2లో అదే జోష్ ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఏ ఎపిసోడ్ కి ఏ గెస్ట్ ని పిలుస్తారో అసలు ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తున్నారు. అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లను పిలిచి రచ్చ చేశారు బాలయ్య. ఆ తరువాత యంగ్ హీరోలైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్, శర్వానంద్ లతో రచ్చ చేయడంతో పాటు.. అగ్ర నిర్మాతలైనటువంటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలను కూడా షోకి పిలిచి ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించారు బాలయ్య. 

Advertisement

ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, గోపిచందు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ గురించి రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ఇంకా పూర్తికాకముందే మరొక స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్టు సమాచారం. గతంలోనే అన్ స్టాపబుల్ టాక్ షోకి పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ వస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు అది జరుగలేదు. కానీ తాజాగా ఇప్పుడు అది సాకారం కాబోతుంది. త్వరలోనే బాలయ్య నిర్వహించే టాక్ షోలో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో మిగతా హీరోలకు లేని ప్రత్యేకతలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి ఉన్నాయి. ఎన్టీఆర్ నటవారసుడిగా బాలయ్య జయకేతనం ఎగురవేస్తే.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అభిమానులను విశేషంగా మురిపించారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా 2001లో బాలయ్య నటించిన నరసింహనాయుడు, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ సార్లు పాలుపంచుకున్నారు వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది.  

Advertisement

Also Read :  విజయ్ వారసుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ ..మరి విజయ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఏదో తెలుసా…,?

Balakrishna Manam News

వీరిద్దరూ సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా రాణిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. పవన్ కళ్యాణ్ జనసేనానిగా తాను ఓ రూట్ లో వెళ్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో పవన్ కళ్యాణ్ జనసేన పొత్తు ఉంటుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే బాలయ్య టాక్ షోలోనే పవన్ గెస్ట్ గా రావడం మరింత విశేషంగా మారింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు హింట్ ఇచ్చారు బాలయ్య. ఓ ఎపిసోడ్ లో దర్శకుడు త్రివిక్రమ్ కి కాల్ చేసి ఎప్పుడొస్తున్నారు షోకి.. ఎవరితో రావాలో తెలుసుగా.. అని పవన్ కళ్యాన్ వస్తున్నారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసారు. డిసెంబర్ 31కి ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ ప్రసారం అవుతుండగా.. సంక్రాంతికి పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ఎపిసోడ్ ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read :  ఆమె ఓ స్టార్ నటి.. ఇంట్లో టీవీ కూడా లేదట.. డబ్బు ఏం చేస్తుందో తెలిస్తే గ్రేట్ అంటారు..!!

Visitors Are Also Reading