Home » విఘ్నేష్ శివన్ నయనతారల మధ్య లవ్ ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా..?

విఘ్నేష్ శివన్ నయనతారల మధ్య లవ్ ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరోయిన్ నయనతార అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఒక మార్క్ ను సంపాదించుకుంది నయనతార. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమె సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలో మాత్రమే చేసిన ఈ అమ్మడు తర్వాత పూర్తిగా నటనకే పరిమితమై లేడీ ఓరియంటెడ్ పాత్రలను చాలా అలవోకగా చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిందని చెప్పవచ్చు. తన 20 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో సినిమాలు చేసి విజయవంతంగా ముందుకుపోయింది నయనతార. అయితే నయనతార మరియు దర్శకుడు విజ్ఞేశ్ శివన్ మధ్యలో ప్రేమాయణం నడుస్తోందని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. వీరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం నేను రౌడీ నే సినిమా.. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి అభిప్రాయాలు కలిసి ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగిందట. నేను రౌడీ నే మూవీ ఈవెంట్లలో నయన్ మరియు విజ్ఞేశ్ గంటల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారని ఆ మధ్య సోషల్ మీడియాలో మాత్రం వార్తలు చక్కర్లు కొట్టాయి.

Advertisement

Advertisement

 

2017 లో అవార్డు ఫంక్షన్ లో కూడా వీరిద్దరు జంటగా కనిపించడంతో ఇక వీరు ప్రేమలో ఉన్నారనే అపోహ తేటతెల్లమైంది. నయన్ మంచి నటనే కాకుండా మంచి మనసున్న అమ్మాయి అని దర్శకుడు విజ్ఞేశ్ శివన్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.2021 మార్చి 25వ తేదీన వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. మరికొన్ని గంటల్లో మహాబలిపురంలో ఈ చూడ ముచ్చటైన జంట వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల నుండి చిరంజీవి మరియు సమంత లకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

ALSO READ;

ఫస్ట్ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

అనిల్ రావిపూడి తో జరిగిన గొడవ వల్లే తమన్నా ఎఫ్- 3 ప్రమోషన్స్ కు దూరంగా ఉందా….అసలేం జరిగిందంటే..!

 

Visitors Are Also Reading