Telugu News » Blog » పెళ్లిలోనే పెళ్లి కొడుకు ఏం చేసాడో తెలుసా..? తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

పెళ్లిలోనే పెళ్లి కొడుకు ఏం చేసాడో తెలుసా..? తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Anji

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాకే చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిన‌ప్ప‌టి నుండి నెట్టింట్లో ర‌క‌ర‌కాల ఫ‌న్నీ వీడియోలు ద‌ర్శనం ఇస్తున్నాయి. కొంద‌రూ వైర‌ల్ అవ్వ‌డానికి కావాల‌నే ఫ‌న్ని వీడియోల‌ను క్రియేట్ చేస్తుంటారు. మ‌రికొన్ని మాత్రం అలా ఉండ‌వు. స‌హ‌జంగానే కొన్ని సంఘ‌ట‌న‌లు అలా జ‌రిగిపోతుంటాయి. క‌డుపుబ్బా న‌వ్వులు తెప్పిస్తాయి. అలాంటి వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.ఓ పెళ్లి వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. బందువులు, స్నేహితులు అంద‌రూ వ‌చ్చారు. అనుకున్న ప‌నుల‌న్ని సవ్యంగానే సాగిపోయాయి. జ‌య‌మాల వేడుక‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. తొలుత వ‌రుడి మెడలో వ‌ధువు జ‌య‌మాల వేసింది. ఆ వెంట‌నే వ‌రుడు కూడా ఆమె మెడ‌లో జ‌య‌మాల వేసాడు. అది వేసిన త‌రువాత అత‌గాడు హ‌మ్మ‌య్యా పెళ్లి అయిపోయిందనుకున్నాడు. ఇదే స‌మ‌యంలో అత‌నికి ఉన్న‌ట్టుండి ఏసీ లాంటి చ‌ల్ల‌ని గాలిని అనుభూతి చెందిన‌ట్టు అయింది. ఇప్ప‌టివ‌ర‌కు వేడిగా ఉన్న వాతావ‌ర‌ణం అక‌స్మాత్తుగా చ‌ల్ల‌గా ఎలా మారింద‌ని ఆలోచిస్తున్నాడు.

 

ఇంత‌లోనే పెళ్లి వేడుక‌కు విచ్చేసిన వారంద‌రూ ఓరేయ్‌.. నీ ప్యాంట్ ఊసిపోయింది వేసుకో అని ప‌కప‌క న‌వ్వేసారు. అప్ప‌టివ‌ర‌కు ఏసీ త‌గులుతోంద‌న్న భ్ర‌మ‌లో ఉన్న ఆ వ‌రుడు, ఒక్క‌సారిగా తేరుకొని ప్యాంట్ వేసుకున్నాడు. అత‌ని ముందే ఉన్న వ‌ధువు ఆ దృశ్యం చూసి ప‌క్క‌న న‌వ్వేసింది. అయ్యో పెళ్లాం ముందు పరువు పాయే అంటూ.. అత‌డు సిగ్గుతో ప్యాంట్ వేసుకున్నాడు. ఒత్తిడిలో ఉన్న వ్య‌క్తుల‌ను సైతం న‌వ్వించే ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : 

Sonu Sood : ద‌క్షిణాది చిత్రాల‌పై సోనూసూద్ ఏమ‌న్నారో తెలుసా..?

దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎంత గ్లామర్ గా ఉందంటే.. చూస్తే..?

You may also like