Home » ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో షఫీ ఏం చేశాడో తెలుసా..?

ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో షఫీ ఏం చేశాడో తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా సూపర్ హిట్ చిత్రాలకుండే క్రేజీనే వేరు. ఒకప్పుడు అలరించిన సినిమాల్లో ఆసక్తికరమైన విషయాల గురించి తెలిసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఖడ్గం సినిమా షూటింగ్ సమయంలో కీలకపాత్ర పోషించినటువంటి షఫీ చేసిన ఓ పని గురించి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ఖడ్గం సినిమాతో షఫీ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత వెంకటేష్ ఘర్షణ, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలో, మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో అన్న నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 20 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 50 కి పైగా చిత్రాల్లో నటించాడు షఫీ. ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే కావాలని పట్టుబట్టడంతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాడు. ఖడ్గం సినిమాలో తీవ్రవాదిగా నటించేందుకు చాలా రిస్క్ చేశాడు. ఆ పాత్రకు ప్రాణం పోయడం కోసం చార్మినార్ వీధుల్లో తన స్నేహితుని ఇంట్లో ఒక నెల రోజులపాటు ఉండి అక్కడి వారి అలవాట్లు బాగా అర్థం చేసుకున్న తర్వాతే ఖడ్గం సినిమాలో నటించాడట షఫీ. వాస్తవానికి ఒక నటుడు ఒక పాత్ర కోసం ఇలా చేయడం అంటే నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Advertisement

Also Read :   ఏడాదిలోనే 10కి పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన హీరోలు వీరే..!!

Khadgam Movie|| Shafi Planning For Vasu Escape From Jail Scene - YouTube

కొంతకాలం సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా షఫీ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో మాత్రం కీలక పాత్రలో నటించాడు. మరికొన్ని సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకొని బిజీబిజీగా మారిపోయాడు అని తెలుస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా షఫీ నటన అద్భుతమనే చెప్పాలి. ఒక నటుడు నటన కోసం ఎంత శ్రమించాడో షఫీ నీ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

Also Read :   సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణం కమనీయం.. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే..?

Visitors Are Also Reading